Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి,. అక్కడి ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ వైసీసీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే భార్య సుధ పోటీలో ఉండడంతో అన్ని పార్టీలు పోటీకి దూరమయ్యాయి. ఒక్క బీజేపీ మాత్రం బరిలో నిలిచింది. తాము కుటుంబ పాలనకు వ్యతిరేకమనే ఉద్దేశంతోనే పోటీలో ఉన్నట్లు బీజేపీ ప్రకటిస్తోంది.

ఇన్నాళ్లు పోటీలో ఉన్నట్లు ప్రకటించిన టీడీపీ ఉన్నట్లుండి మనసు మార్చుకుంది. సంప్రదాయానికి వైసీపీ తూట్లు పొడిచినా తమలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని చెబుతూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా పోటీలో ఉండటం లేదని ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బద్వేల్ బరిలో ఇద్దరే నిలిచారు.
తెలుగుదేశం పార్టీ పొలిబ్యూరో సమావేశంలో ఈ మేరకు పోటీ నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో బద్వేల్ లో ఇన్నాళ్లు పోటీలో ఉంటున్నట్లు చెప్పడంతో అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ టీడీపీ తరఫున ప్రచారం సైతం నిర్వహించారు. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ప్రస్తుతం రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది.
ఇంకా నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా డ్రాప్ అయితే ఏకగ్రీవం అవుతుందని అందరు ఆశిస్తున్నారు. కానీ పోటీలో నిలిచేందుకే బీజేపీ సిద్ధం కావడంతో ఎన్నిక అనివార్యమే అని తెలుస్తోంది. దీంతో బద్వేల్ బరిలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త చర్చలకు దారి తీస్తోంది. మొత్తానికి వ్యవహారం ఓ రసవత్తరంగా సాగుతోంది.