Secundrabad Incident: కేంద్రంలో సైన్యంలో ప్రవేశాల కోసం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను నిరసిస్తూ రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ జ్వాలలు దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కేంద్రానికి తాకాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆందోళన విధ్వంసానికి దారితీసింది. అయితే ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. ఆర్మీ ఉద్యోగ ఆశావహులు వాట్సాప్ గ్రూపుల్లో ఈ సందేశాన్ని ముందుగానే సర్క్యులేట్ చేసినట్లు సమాచారం. ఇక్కడ ఇంటలెజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ కావాలనే నిలువరించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే ‘అగ్ని’కి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.
జిల్లాల నుంచి రాజధానికి నిరసన కారులు..
సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో నిరసనకు పిలుపునిచ్చి సర్క్యులేట్ చేసుకున్న ఆర్మీ ఉద్యోగాలు ఆశిస్తున్నవారు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల స్ఫూర్తితో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కేంద్రంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఒకరోజు ముందే అన్ని జిల్లాల నుంచి నిరసన కారులు రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. ఎక్కడికి వచ్చింది. ఎలా వచ్చింది.. సికింద్రాబాద్‌కు ఎలా చేరుకోవాలనే విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు షేర్‌చేసుకుంటూ వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం స్టేçషన్‌కు చేరుకున్న నిరసన కారులు మొదట స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడే ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు.
నిరసనలో చొరబడి..
శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనలోకి ఆర్మీ ఉద్యోగార్థులతో సంబంధం లేకుండా ఇతరులు చొరబడినట్లు తెలుస్తోంది. విధ్వంసమే లక్ష్యంగా చొరబడిన అసాంఘిక శక్తులు మొదట బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అప్పటికే ఆవేశంగా ఉన్న నిరసన కారులు రెచ్చిపోయారు. 9 గంటల సమయంలో ఆందోళనకారులు ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్ లోపలికి దూసుకొచ్చి పట్టాలపై బైఠాయించారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమం విధ్వంసకారుల చేతుల్లోకి వెల్లింది. ప్లాన్ ప్రకారం.. ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను తొలగించడం, స్టేషన్లో నిలిపిన పలు రైళ్ల కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రైల్వే పార్శిల్ విభాగం వద్ద ఉన్న వస్తువులను తీసుకొచ్చి పట్టాలపై వేసి తగులబెట్టారు. ఆ తర్వాత ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలు స్టేషన్ లోకి వచ్చాయి. ఈ క్రమంలో వాళ్లపై ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించారు. అప్పటికే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఆందోళన సద్దుమణగక పోవడంతో రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
Also Read: Secunderabad Agnipath Protests: అగ్నిపథ్ మంటలు: సికింద్రాబాద్ లో రావణకాష్టం
చేయిదాటేలా చేసిందెవరు?
ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళనను ఇటు రైల్వే ఫోర్స్ కూడా అంచనా వేయలేకపోయింది. ఒక్కసారిగా మూడు వేల మంది స్టేషన్లోకి దూసుకువచ్చి పట్టాలపై బైఠాయించడంతో శాంతి యుతంగనే జరుగుతుందనుకున్న నిరసన విధ్వంసానికి దారితీయడంతతో అవాక్కయ్యారు. ఫోర్స్ అందుబాటులో లేకపోవంతో ఆందోలనకారులను నిలువరించడంలో విఫలమయ్యారు. అయితే రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తుందన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. గురువారం కాంగ్రెస్ తలపెట్టిన రాజ్‌భవన్ ముట్టడి కూడా విధ్వంసానికి దారి తీసింది. అది జరిగి 24 గంటలు గడవక ముందే సికింద్రాబాద్‌లో విధ్వంసం జరుగడం అనుమానాలకు తావిస్తోంది. ఇంటలిజెన్స్ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ హస్తం ఉందా?
రాజ్‌భవన్ ముట్టడి సమయంలో జరిగిన విధ్వంసలో వెనుక అధికార పార్టీ హస్తం ఉన్నట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేçషన్లో జరిన విధ్వంసం బీజేపీ నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. రాజధాని నడిబొడ్డున ప్రతిపక్షాలు చిన్న నిరసర కార్యక్రమం చేపట్టినా హౌస్ అరెస్టులు చేసే పోలీసులు రెండు రోజులు విధ్వంసం జరిగినా సమాచారం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. విధ«్వంసానికి దాదాపు అరగంట సమయం పట్టింది. అయినా పోలీసు బలగాలు అక్కడికి చేరుకోవడాననికి గంట సమయం పట్టింది. ఆలస్యం కూడా అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలలో ఉన్న టీఆర్ఎస్ నేతలు విధ్వంలో నేరుగా పాల్గొన్నందున ప్రభుత్వ ఆదేశాలతోనే ఇంటలిజెన్స్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేరుగా పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టారు. పోలీసులవైఫల్యంతోనే విధ్వంసం జరిగిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విధ్వంసం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. కేంద్రాన్ని బద్నాం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధ్వంసానికి ఒడిగట్టిందని ఆరోపించారు. రాష్ట్ర రాజధానిలో ఆడపిల్లలకు, ప్రజలకు రక్షణ కరువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Sridevi- Chiranjeevi: శ్రీదేవి నిర్మాతగా.. చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఏమిటో తెలుసా?
Web Title: Who set the fire in secunderabad did it happen with a definite plan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com