Homeఆంధ్రప్రదేశ్‌CM KCR On AP: ఏపీలో గులాబి బాస్ టార్గెట్ ఎవ‌రు ?

CM KCR On AP: ఏపీలో గులాబి బాస్ టార్గెట్ ఎవ‌రు ?

CM KCR On AP: ఏపీలో కేసీఆర్ ఫోక‌స్ ఎవ‌రి పైన ? బీఆర్ఎస్ దూకుడు ఎవ‌రికి న‌ష్టం ? ఎవ‌రికి లాభం ? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. సంక్రాంతి సంద‌ర్భంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనే చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఏపీలోని కీల‌క ప్రాంతాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుతో బీఆర్ఎస్ ఫోక‌స్ పైన స్ప‌ష్ట‌త‌నిస్తోంది. సంక్రాంతి త‌ర్వాత ఏపీ బ‌రిలో దిగేందుకు బీఆర్ఎస్ సిద్ధ‌మ‌వుతోంది.

CM KCR On AP
CM KCR On AP

ఏపీలో బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ త‌ర్వాత ఏపీ పైనే ఎక్కువ‌గా దృష్టి సారించింది. సంక్రాంతి తర్వాత విస్త‌ర‌ణ వేగంగా చేప‌ట్టాల‌ని భావిస్తోంది. విజ‌య‌వాడ‌, కోస్తాంధ్ర‌లోని కీల‌క ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్రశేఖ‌ర్ సంక్రాంతి సంద‌ర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాపులు అధికంగా ఉన్న ప్రాంతాలైన కాకినాడ‌, ముమ్మ‌డివ‌రం, పోల‌వరం, యానాం ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పై అంద‌రి దృష్టి ప‌డింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపు సామాజివ‌ర్గ ఓటు బ్యాంకే ల‌క్ష్యంగా బీఆర్ఎస్ ఎత్తుగ‌డ వేసింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కాపుల ఓట్లు చీల్చ‌డం ద్వార ప‌వ‌న్ కు న‌ష్టం క‌లిగించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నేది ప‌లువ‌రి వాద‌న‌. కాపు ఓట్లు చీల్చితే జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ప్ర‌భావం అధికార పార్టీ పైన ఉండ‌ద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇందులో భాగంగానే కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన తోట చంద్ర‌శేఖ‌ర్ కు ఏపీ ప‌గ్గాలిచ్చార‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా బీఆర్ఎస్ వ్యూహం జ‌గ‌న్ పార్టీకి క‌లిసొస్తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు జ‌న‌సేన‌, టీడీపీల వైపు పూర్తీగా వెళ్ల‌కుండా చూసే వ్యూహం కూడ బీఆర్ఎస్ కు ఉంద‌ని మ‌రో చ‌ర్చ జ‌రుగుతోంది.

CM KCR On AP
CM KCR

జ‌న‌సేన‌, టీడీపీ అసంతృప్తుల్ని, కాపు నేత‌ల్ని బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం తోట చంద్ర‌శేఖ‌ర్ ముమ్మ‌రంగా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌న‌సేన నేత‌, త‌మిళ‌నాడు మాజీ సీఎస్ రామ్మోహ‌న్ రావు కేసీఆర్ ను క‌లిశారు. ఇదే త‌ర‌హాలో మ‌రికొంద‌రు బ్యూరోక్రాట్ల‌ను బీఆర్ఎస్ వైపు న‌డిపించాల‌ని తోట చంద్ర‌శేఖ‌ర్ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అయితే… జ‌న‌సేన , టీడీపీ మాత్రం బీఆర్ఎస్ ను ప‌ట్టించుకోవ‌డం లేదు. బీఆర్ఎస్ ప్ర‌భావం ఏమాత్రం ఉండ‌ద‌ని భావిస్తున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version