Indian Prime Ministers Foreign Tours: అత్యధిక విదేశీ పర్యటనలు సాగించిన భారత ప్రధానిగా శ్రీమతి ఇందిరా గాంధీ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ భారతదేశానికి 14 మంది ప్రధానులు ప్రాతినిధ్యం వహించారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ కాగా..ప్రస్తుత ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు. మధ్యలో 12 మంది ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు. దేశానికి ఇందిరాగాంధీ సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేశారు. అంతర్జాతీయంగా ద్వైపాక్షిక సమావేశాలకు బీజం పడింది ఇందిరాగాంధీ హయాంలోనే. ఆమె తన పదవీకాలంలో ఏకంగా 111 విదేశీ సందర్శనలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1966 నుంచి 77 వరకూ, 1980 నుంచి 84 వరకూ ఇందిరా గాంధీ ప్రధానిగా పదవి నిర్వర్తించారు.
దేశ మొదటి ప్రధానిగా ప్రాతినిధ్యం వహించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన పదవి కాలంలో కేవలం 70 సందర్శనలు మాత్రమే చేశారు. 1947 నుంచి 1964 వరకూ నెహ్రూ దేశానికి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 17 సంవత్సరాల పదవీ కాలంలో ఏడాదికి సగటున నాలుగుసార్లు మాత్రమే పర్యటించగలిగారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీకాలంలో 93 సందర్శనలు చేశారు. 2004 నుంచి 2014 వరకూ ప్రధానిగా ఉన్న ఆయన ఏడాదికి సగటున తొమ్మిది సార్లు పర్యటించాడు.
అయితే దేశానికి 14వ ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఇప్పటివరకూ 79 విదేశీ సందర్శనలు చేశారు. 2014 నుంచి ప్రధానిగా ఉన్నారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పటివరకూ ప్రాతినిధ్యం వహించిన ప్రధానుల్లో ఇందిరాగాంధీ విదేశీ పర్యటనల్లో అరుదైన రికార్డును సృష్టించారని చెప్పొచ్చు. దేశానికి మూడో ప్రధానిగా ఎన్నికయ్యారు. రెండో ప్రధానిగా లాల్ బహుదూర్ శాస్త్రి ఉన్నారు. మధ్యలో గుల్జరిలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. మూడో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీ సుదీర్ఘ కాలం పనిచేయగలిగారు.