https://oktelugu.com/

Polavaram: ‘పోలవరం’ పనులు ఆలస్యానికి కారణం ఎవరు..? ఎవరిది నిర్లక్ష్యం..?

Polavaram:  ఆంధ్రప్రదేశ్ జీవనాడి ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణానికి అడగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 23 లక్షల ఎకరాలకు నీరందించాలని పెట్టుకున్న లక్ష్యం నీరుగారిపోతుంది. వందలాది మంది ఇంజనీర్ నిపుణులు, వేలాది మంది శ్రామిక శక్తిని ఉపయోగించి ‘పోలవరం’ పనులు మొదలు పెట్టినా పూర్తికావడానికి ఇంకెంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. 2004లో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై రెండు దశాబ్దాలకు చేరువవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ.. ‘పోలవరం’ మాత్రం పూర్తి కావడం లేదు. అప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2022 / 09:14 AM IST
    Follow us on

    Polavaram:  ఆంధ్రప్రదేశ్ జీవనాడి ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణానికి అడగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 23 లక్షల ఎకరాలకు నీరందించాలని పెట్టుకున్న లక్ష్యం నీరుగారిపోతుంది. వందలాది మంది ఇంజనీర్ నిపుణులు, వేలాది మంది శ్రామిక శక్తిని ఉపయోగించి ‘పోలవరం’ పనులు మొదలు పెట్టినా పూర్తికావడానికి ఇంకెంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. 2004లో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై రెండు దశాబ్దాలకు చేరువవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ.. ‘పోలవరం’ మాత్రం పూర్తి కావడం లేదు. అప్పుడు పూర్తిచేస్తాం.. ఇప్పుడు పూర్తి చేస్తాం.. గద్దెనెక్కిన ప్రభుత్వాలు మాటలు నీటిమూటలే అవుతున్నాయి తప్ప ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వమూ సాహసించడం లేదు. దీంతో వృథాగా పోయే 30 టీఎంసీల నీటికి అడ్డుకట్ట వేయాలన్న ప్రణాళిక ఫెయిల్ అవుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పోలవరం గురించి పలు విశేషాలు మీకోసం..

    Polavaram:

    ధవళేశ్వరం ప్రాజెక్టుకు 50 కిలోమీటర్ల ఎగువన పోలవరం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మొదట్లో దీనిని రామపాద సాగర్ గా నామకరణం చేశారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్ భద్రాచల రాముడి ఆలయాన్నితాకుతాయి. అయితే ఆ తరువాత ‘పోలరవరం’ ప్రాజెక్టుగా మార్చారు. 2004లో 8200 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయితే అటవీశాఖ అనుమతులు రానందున 2006లోపనులను నిలిపివేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఈ ప్రాజెక్టుపై ఎవరూ దృష్టి సారించలేదు. దీంతో మరికొన్ని రోజులు ఆలస్యమయ్యాయి.

    Also Read: ‘వనమా’ దొరికాడిలా.. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

    2013లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది. అంటే 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. అప్పటి అంచనా వ్యయం రూ.20,338 కోట్లు. అయితే జాతీయ హోదా ఇవ్వకముందు ఖర్చులు పోను రూ.15,667 కోట్లు నిధులు ఇస్తామనికేంద్రం చెప్పింది. అయితే నిర్మాణ వ్యయం పెరగడంతో అంచానా విలువ కూడా పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లకు పెంచాలని అంటున్నారు. అయితే కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడడం లేదు. కానీ 44,725 కోట్లకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అనుమతి ఇచ్చింది. అయితే పీపీఏ ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తికి నివేదించాలి. అప్పుడే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల అవుతాయి. కానీ ఈ వ్యవహారం పెండింగులో పడింది.

    పోలవరం  ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం స్పిల్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే దాదాపుగా ప్రాజెక్టు పనులు ఓ దశకు చేరుకున్నాయంటున్నారు. దీంతో బ్యాక్ వాటర్ పోలవరం, దేవీ పట్నం, వీఆర్ పురం మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది. పోలవరం పూర్తయితే 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆయా గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలు నిరాశ్రయులుగా మారుతాయి. అయితే ఇప్పటికే పునరావాస కాలనీల్లో 3,110 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ప్రభుత్వం తెలుపుతోంది.

    ఉమ్మడి రాష్ట్ర పునర్విభన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పూర్తి చేస్తామని శపథం చేసింది. అప్పటి నీటివనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ‘ 2016 మార్చి 10 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. రాసిపెట్టుకో..’ అని అన్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అలాగే చెప్పింది. ఈ ప్రభుత్వానికి చెందిన మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ ‘తొందరెందుకు నాన్నా… 2021 డిసెంబర్ 1కే పోలవరం పూర్తి అవుతుంది.. 2022 ఖరీఫ్లో పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తాం’ అని అన్నారు. అయితే రెండు పార్టీలకు చెందిన మంత్రులు తమ మాటలను నిలబెట్టుకోలేదని మేధావులు అంటున్నారు.

    Also Read: ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!