Mulugu Ramalingeswara Siddhanti: ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన ప్రముఖ సిద్ధాంతిగా పలు పత్రికలు, ఛానళ్లలో తన ప్రసంగాల ద్వారా ప్రజలకు జ్యోతిష్యం గురించి తన సేవలందించారు. జ్యోతిష్యమంటేనే ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అనే విధంగా అందరికి సుపరిచితుడైన ఆయన అకాల మరణం చెందడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముప్పై ఏళ్లుగా జ్యోతిష్యంలో సేవలందిస్తున్న ఆయన దేశ విదేశాల్లో కూడా ఆయనకు అనుచరులుండటం గమనార్హం.
జ్యోతిష్యంలో ఆయన చెప్పిన విషయాలు ఎన్నో దాఖలయ్యాయి. భవిష్యత్ ను ముందే ఊహించి చెప్పడం ఆయనకు అలవాటు. అలా ఆయన చెప్పిన పలు విషయాలు నిజం కూడా అయిన సంగతి తెలిసిందే. అంతటి ప్రతిభావంతులైన ములుగు సిద్ధాంతి ఇక లేరనే వార్త అందరిని కలచివేస్తోంది. ప్రకృతి విపత్తులైనా, సంచలనాత్మక విషయాలైనా ఆయన చెబితే తిరుగుండేది కాదు. దీంతో ఆయన పంచాంగంపై అందరికి ఆసక్తి ఉండేది.
Also Read: ఆస్కార్ బరిలో నిలిచిన భారతీయ చిత్రాల లిస్ట్ !
గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన ఆయన శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి హోమాలు, క్రతువులు, పూజలు చేసే వారు. బ్రాహ్మణ వృత్తిలోకి వచ్చే వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేసేవారు. పంచాంగం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాల పై తనదైన శైలిలో చర్చించేవారు. తనను కలిసిన వారికి పంచాంగం చెబుతూ వారిలో ఉన్న భయాలను పోగొట్టేవారు.
పంచాంగంతోపాటు సమాజ హిత పనులకు శ్రీకారం చుట్టారు. మిమిక్రీ కళాకారుడిగా తనదైన పద్ధతిలో ప్రదర్శనలిచ్చారు. సినీ కళాకారులతో కలిసి ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రదర్శనలిచ్చి అందరిని మెప్పించారు. లోక కల్యాణం కోసమే తన జీవితాన్ని ధార పోశారు. చెడు విషయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించే వారు కాదు. మంచికే ప్రాధాన్యం ఇచ్చేవారు. పదిమంది తమ ఖ్యాతిని చూసి గర్వించాలని చూసేవారు. అందుకు అనుగుణంగా తన పద్ధతులను మార్చుకునే వారు.
పంచాంగ శ్రవణంలో తనదైన ముద్ర వేసేవారు. ఆయన చెప్పే వాటి కోసం అహర్నిశలు శ్రమించేవారు. ఎవరెన్ని మాటలు అన్నా తనలోని మాటలను పదిమందికి తెలిపేవారు. మంచినే ఆశ్రయించాలని చెడును తుంచాలని తెగేసి చెప్పేవారు. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించేవారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రాల్లో ఆయన హోమాలు నిర్వహించే వారని తెలుస్తోంది.
Also Read: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో క్రేజీ అప్ డేట్ రివీల్ !