https://oktelugu.com/

తెలంగాణలో నడిపించే నాయకుడెవరు..?

వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి పోటీ తీవ్రమైంది.దుబ్బాక ఎన్నికల్లో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి వెళ్లిన కాంగ్రెస్, ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ రెండంటే రెండే సీట్లలో గెలిచింది. ఈ అవమానం భరించని ఆ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కొందరు ఇప్పడు టీపీసీసీ పదవి దక్కించుకునేందుకు తీవ్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2020 10:56 am
    Follow us on

    Telangana Congress

    వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి పోటీ తీవ్రమైంది.దుబ్బాక ఎన్నికల్లో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి వెళ్లిన కాంగ్రెస్, ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ రెండంటే రెండే సీట్లలో గెలిచింది. ఈ అవమానం భరించని ఆ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కొందరు ఇప్పడు టీపీసీసీ పదవి దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పదవి దక్కించుకోవడం పక్కనబెడితే పార్టీని గెలపించే సత్తా తమలో ఉందా..? అన్న విషయాన్ని గ్రహించాలని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు.

    Also Read: ‘నాగార్జున సాగర్’ పై నజర్..!

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం లేదు. 2014 ఎన్నికల్లో కొన్ని సీట్లు సాధించి రెండో స్థానంలో ఉన్న చేయి పార్టీ 2019 ఎన్నికల్లో ఆ సీట్లు మరిన్ని తగ్గాయి. అయితే గెలిచిన వారందరూ తట్టా బుట్ట సదురుకొని టీఆర్ఎస్ పార్టీలోకి జారుకున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఒకే ఒక్కడు కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన చిన్నా చితక ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలబడింది.

    ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ మరీ అధ్వాన స్థితికి చేరడంతో అప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు నాయకత్వ మార్పుపై పట్టుబడుతున్నారు. బీజేపీలో నాయకత్వ మార్పుతోనే ఆ పార్టీ దూసుకెళ్తోందని, తమ పార్టీకి కూడా కొత్త నాయకత్వం కావాలని అంతరంగా పట్టుబట్టారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లయినా సాధిస్తుందనుకున్న కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు కూడా నాయకత్వ మార్పే శరణ్యమని భావించి తన పదవికి రాజీనామా చేశాడు.

    Also Read: ‘గ్రేటర్’పై అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం.. స్పెషల్ పాలనకే మొగ్గు..!

    అయితే ఉత్తమ్ రాజీనామాతో టీపీసీపీ పోస్టుపై పోటీ తీవ్రమైంది. ఇప్పటికే పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని వీహెచ్ హనుమంతరావు పట్టుబడుతున్నాడు. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారకుండా, పార్టీ కోసమే పనిచేస్తున్న తనకే టీపీసీపీ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నారు. ఇంకో వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయ్యారు. అయితే పార్టీలో యాక్టివ్ గా కనిపించే రేవంత్ రెడ్డిపై కొందరు మొగ్గు చూపుతున్నారు.

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకంతో పార్టీ ప్రతిష్ట పెరిగింది. అలాగే యూత్ లో క్రేజ్ ఉన్న రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తేనే ఇప్పుడున్న సమయంలో కాంగ్రెస్ మనుగడ సాధిస్తుందని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత: కలహాలు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయ శ్రేణి నాయకులు రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నా సీనియర్ నాయకులు మాత్రం రేవంత్ కు అవకాశం ఇవ్వకుండా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరి చివరకి ఎవరిని నియమిస్తారో చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్