Also Read: రూ.100 లక్షల కోట్ల అప్పు.. కేంద్రానికి తప్పలేదు!
వ్యవసాయం రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం ఈనెల 14న పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల సవరణ బిల్లు-2020ను లోక్ సభ ఇటీవల ఆమోదించింది. ఈ సంస్కరణలను కేంద్రం అమలు చేయడం ద్వారా వ్యవసాయం రంగం కూడా కార్పొరేట్ శక్తుల్లోకి వెళుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఉత్తరాది రాష్ట్రాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి పట్టున్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం గమనార్హం.
కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలపై దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా అవగాహన లేనట్లు కన్పిస్తోంది. కాగా ఉత్తరాది రాష్ట్రాల రైతులు మాత్రం కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కు దారధాత్తం చేస్తుందని గ్రహించి ముందుగానే మేల్కొంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర రాకపోవడం.. ఇకపై ఎఫ్సీఐ రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయదని అంటున్నారు. అయితే రైతులు వ్యతిరేకించడానికి చాలా కారణాలున్నట్లు కన్పిస్తున్నాయి.
ఈ కొత్త బిల్లు ప్రకారం రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్ బయట క్రయవిక్రయాలు చేసుకునే వీలుంటుంది. రైతులకు ఆదాయాన్ని పెంచే దిశగా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రం చెబుతోంది. అయితే రైతుల మాత్రం సంస్కరణ ముసుగులో కేంద్రం వ్యవసాయాన్ని కార్పొరేట్ మాయం చేస్తుందని ఆరోపిస్తున్నారు.
Also Read: చైనాకు సహకారం? ప్రముఖ జర్నలిస్ట్ అరెస్ట్?
ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బిల్లులు అమలు చేయడం ద్వారా రైతులు కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడే పరిస్థితి వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు వల్ల ఎవరికీ లాభం చేకూరుతుందో వేచిచూడాల్సిందే..!