https://oktelugu.com/

 సీఎంఆర్‌‌ఎఫ్‌ అక్రమాలకు పాల్పడింది అతనేనా.?

‘కంచె చేను మేసినట్లు’గా ఏపీలో వైసీపీ చిన్నపాటి లీడర్‌‌ ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ నిధులకు ఎసరు పెట్టాడు. ఏకంగా రూ.117 కోట్లు కొట్టేయాలని స్కెచ్‌ వేశాడు. ఏసీబీ, సీఐడీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించడంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. Also Read: తిరుపతి లోక్ సభ బరిలోకి బీజేపీ.. సోము వీర్రాజు సై కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన  ఓ నేత ఈ ఉదంతానికి తెరతీసినట్లు గుర్తించినట్టు సమాచారం.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి […]

Written By: , Updated On : September 23, 2020 / 02:01 PM IST
fruad

fruad

Follow us on

fruad‘కంచె చేను మేసినట్లు’గా ఏపీలో వైసీపీ చిన్నపాటి లీడర్‌‌ ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ నిధులకు ఎసరు పెట్టాడు. ఏకంగా రూ.117 కోట్లు కొట్టేయాలని స్కెచ్‌ వేశాడు. ఏసీబీ, సీఐడీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించడంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది.

Also Read: తిరుపతి లోక్ సభ బరిలోకి బీజేపీ.. సోము వీర్రాజు సై

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన  ఓ నేత ఈ ఉదంతానికి తెరతీసినట్లు గుర్తించినట్టు సమాచారం.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కావాలంటూ కొంత మంది బాధితుల్ని తీసుకెళ్లడం.. తన పలుకుబడిని ఉపయోగించి వారికి సాయం చేయడం చేశాడు. అలా వచ్చిన చెక్కులను తన ఖాతాలో వేసుకోవడం. ఆ మేరకు నగదును మాత్రం బాధితులకు ఇవ్వడం చేశాడు. సీఎంఆర్‌‌ఎఫ్‌ నుంచి వచ్చిన చెక్కులను పెద్ద మొత్తంలో ఉన్న అమౌంట్లుగా మార్చి బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఈ ఉదంతానికి కారకుడుగా భాస్కర్‌‌రెడ్డి అనే నేత అని తెలుస్తోంది. సామాన్యుడిగానే ఉండే ఈయన  ఆలోచనలు మాత్రం వందల కోట్ల స్థాయి. అయితే.. ఈ తతంగం వెనుక ఏదైనా పెద్ద గూడుపుఠాణి ఉంటుందా అని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు నిన్నంతా సచివాలయంలో.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిర్వహణ చూసే ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంలో 1500 మంది వరకూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పటికీ అందులో వెయ్యి కూడా లక్షకు మించి లేవు. మిగతావన్నీ లక్షలోపేనని వారు వివరించారు. కానీ అదే సమయంలో వివిధ చెక్కుల పేరుతో డ్రా అయిన పెద్ద మొత్తాల వివరాలు తీసుకున్నారు.

Also Read: ఇష్టమొచ్చినట్లు యాప్స్ డౌన్లోడ్ చెయ్యొద్దు : కేంద్రం

భాస్కర్‌‌ రెడ్డి ఫేక్‌ చెక్కులు క్రియేట్‌ చేసి ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తా బ్రాంచీల్లో వేశాడు. ఆయన అంత పెద్ద చెక్కులను ఆయా బ్యాంకుల్లో ఎలా వేయగలిగాడు..? అసలు ఆ కంపెనీలతో భాస్కర్‌‌ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి..? అవి అసలు కంపెనీలా.. నకిలీవా..? అని వెలికితీసే పనిలో పడ్డారు అధికారులు. ఇందుకోసం సీఐడీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఎంఆర్ఎఫ్ లెక్కలు ఆడిట్ చేస్తే ఎవరెవరికి ఎంతెంత వెళ్లాయి ఎంత డ్రా చేసుకున్నారనేది స్పష్టం అవుతుందని అధికారులు అంటున్నారు.