Vangaveeti Radha: ఏపీ రాజకీయాల్లో ప్రజెంట్ వంగవీటి రాధా సంచలన కామెంట్స్ చర్చనీయాంశంగా ఉన్నాయి. తన హత్యకు కుట్ర చేశారని వంగవీటి రాధా చేసిన ఆరోపణల నేపథ్యంలో రాజకీయ పార్టీల వర్గాలు ఈ విషయమై చర్చించుకుంటున్నాయి. ఇకపోతే ఈ ఆరోపణలు చేసే క్రమంలో వంగవీటి రాధా పక్కన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మంత్రి కోడాలి నాని ఉన్నారు. కొడాలి, వల్లభనేని ఇద్దరూ వంగవీటి రాధా మిత్రులు. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కాగా, వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురికి దేవినేని కుటుంబంతో కొంత గ్యాప్ ఉంది. అయితే, వంగవీటి రాధాకు పలు అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఈయన్ను కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం వారు కూడా అభిమానిస్తారు.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయారు. కొడాలి నాని చేతిలో ఓటమి పాలయిన తర్వాత అవినాష్ వైసీపీ గూటికి చేరారు. అవినాష్ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇకపోతే దేవినేని అవినాష్ వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. అక్కడ గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రచించుకుంటున్నారు. అయితే, దేవినేని అవినాష్ కు వంగవీటి రాధా శత్రువు అయితే కాదు. వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ చనిపోయిన తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ముగిసిందని ఇక్కడి రాజకీయ వర్గాలు పేర్కొంటుంటాయి.
Also Read: వంగవీటి రాధా హత్యారోపణలపై చంద్రబాబు మౌనం దేనికి సంకేతం?
ఈ క్రమంలోనే వంగవీటి రాధా చేసిన సంచలన కామెంట్స్ ప్రజెంట్ తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా పోటీ చేయాలని భావిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఫుల్ కాన్సంట్రేషన్ పెడుతున్నారా? అనే చర్చ కూడా ఉంది. అయితే, బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ.. రెండు పార్టీలకూ బలమైన కేడర్ అయితే ఉంది. ఈ క్రమంలోనే వంగవీటి రాధాను హత్య చేయాలనుకునే వారు ఎవరు అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా తనదైన పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ క్రమంలోనే ఆయన వర్గీయులు అంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయంలో ప్రత్యేకమైన బెజవాడ రాజకీయం మళ్లీ మొదలైందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వంగవీటి రాధాను హత్య చేయాలనుకున్నది ఎవరు అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.
Also Read: 2021.. బ్యాడ్ ఇయర్ టు చంద్రబాబు..!