https://oktelugu.com/

Dalit Bandhu: దళితబంధును ఆపేసిన నెపం ఎవరిది?

Dalit Bandhu: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అటు లబ్ధిదారులను.. ఇటు పార్టీలను డిఫెన్స్ లో పడేసింది. ప్రతిష్టాత్మక ‘దళితబంధు’ పథకానికి ఈసీ ఆపివేయడం చిచ్చు రేపింది. టీఆర్ఎస్ ఇది ఆపింది బీజేపీ అంటూ దళితుల్లో ఆగ్రహావేశాలు సెంటిమెంట్ ను రెచ్చగొడుతోంది. ఓటర్లకు లబ్ధి చేకూర్చే బీజేపీ మాత్రం ఏ పథకాలైనా ఎన్నికల ఆపుచేయడం ఈసీ ప్రధాన కర్తవ్యం అని బీజేపీ అంటోంది. అయితే ఈ పథకం అందక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2021 6:16 pm
    Follow us on

    Dalit Bandhu: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అటు లబ్ధిదారులను.. ఇటు పార్టీలను డిఫెన్స్ లో పడేసింది. ప్రతిష్టాత్మక ‘దళితబంధు’ పథకానికి ఈసీ ఆపివేయడం చిచ్చు రేపింది. టీఆర్ఎస్ ఇది ఆపింది బీజేపీ అంటూ దళితుల్లో ఆగ్రహావేశాలు సెంటిమెంట్ ను రెచ్చగొడుతోంది. ఓటర్లకు లబ్ధి చేకూర్చే బీజేపీ మాత్రం ఏ పథకాలైనా ఎన్నికల ఆపుచేయడం ఈసీ ప్రధాన కర్తవ్యం అని బీజేపీ అంటోంది. అయితే ఈ పథకం అందక ఇప్పుడు దళిత లబ్ధిదారులు ఎటువైపు టర్న్ అవుతారోనన్న ఉత్కంఠ నెలకొంది.

    Dalitha-Bandhu-Telangana-List

    Dalitha-Bandhu-Telangana-List

    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి తీసిన బ్రహ్మాస్త్రం ‘దళితబంధు’. ఈ పథకం కింద కేసీఆర్ ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున లబ్ధి చేకూర్చారు. అనూహ్యంగా పోలింగ్ కు 10రోజుల ముందు దళితబంధు పథకాన్ని ఆపేయాలంటూ ఈసీ ఆదేశించింది. ఇది బీజేపీ కుట్రేనని టీఆర్ఎస్ నోటీసులు రాగానే ఆరోపణలు ప్రారంభించింది.

    దళితబంధును హుజూరాబాద్ లో ఆపివేయించేలా చేసింది బీజేపీయేనని.. స్వయంగా బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఈసీకి లేఖ రాశాడని మంత్రి కేటీఆర్ ఆరోపించడం బీజేపీని డిఫెన్స్ లో పడేలా చేసింది.

    దీనికి వెంటనే బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. వారు బయటపెట్టిన లేఖ ఫేక్ అని ఎంపీ అర్వింద్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టిపోశారు. ఈటల రాజేందర్ కూడా ప్రచారంలో స్పందించారు. తాము దళిత బంధును అడ్డుకుంటున్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. తాను దొంగ ఉత్తరాలు పుట్టిస్తున్నారని.. తాను లేఖ రాసినట్లు నిరూపించాలన్నారు.

    ఇక బీజేపీ, టీఆర్ఎస్ ‘దళితబంధు’ పేరిట ఆడుతున్న నాటకాన్ని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఆ రెండు పార్టీలు తోడుదొంగలన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయాక అసలు కేసీఆర్ కు దళితులు గుర్తుకు రారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ కిందకు రాకుండా ఉండడానికే ముందు అమలు చేశారని.. ఈసీ వద్దంటే ఎందుకు ఆపుతున్నారని రేవంత్ రెడ్డి లాజిక్ ప్రశ్న వేశారు.

    ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల వేళ ‘దళితబంధును’ రద్దు చేసిన పార్టీని టార్గెట్ చేసే రాజకీయం మొదలైంది. దళితుల్లో ఆగ్రహావేశాలను ఆ పార్టీపై మళ్లించేలా సరికొత్త రాజకీయం మొదలైంది.