Highest Salary : భారతదేశంలో ఆర్మీ, పోలీసు, పారామిలటరీ బలగాలలో కెరీర్‌ను కొనసాగించాలనే యువతకు ఈ రంగాలలో దేనిలో ఎక్కువ జీతం లభిస్తుందన్న ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. ఇది వారి కెరీర్ ఎంచుకునేందుకు అవసరమయ్యే ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ కథనంలో ఈ మూడు రంగాలలోని జీతం, ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలను పోల్చి చూద్దా.. తద్వారా ఈ సమాచారంతో మీరు ఏ రంగాన్ని ఎంచుకోవాలో నిర్ణయం తీసుకోవచ్చు.
ఆర్మీలో జీతం
ఇండియన్ ఆర్మీలో జీతం ర్యాంక్, అనుభవం, పోస్టింగ్ ప్లేసును బట్టి మారుతుంది. సైన్యంలోని అధికారులు, సైనికులకు వేర్వేరు వేతన స్కేలు ఉన్నాయి. సైన్యంలోని అధికారులు డియర్‌నెస్ అలవెన్స్, హౌసింగ్ అలవెన్స్, వైద్య సదుపాయాలు వంటి ఇతర అలవెన్సులతో పాటు ప్రాథమిక వేతనాన్ని అందుకుంటారు. ఆర్మీలో ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు జీతం గణనీయంగా పెరుగుతుంది. సైనికుడి ప్రారంభ జీతం నెలకు రూ. 25,000 నుండి రూ. 35,000 వరకు ఉంటుంది ఇందులో డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె భత్యం (HRA) కూడా ఉంటుంది. అయితే ఒక కల్నల్ దాదాపు రూ. 1,00,000 జీతం పొందుతాడు. అదే సమయంలో, జనరల్స్ వంటి ఉన్నత స్థాయి అధికారులు రూ. 2,00,000 వరకు జీతం పొందుతారు.
పోలీసులో జీతం
ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), స్టేట్ పోలీస్ సర్వీస్ (SPS)లలో జీతం ఆర్మీలో సమానంగా ఉంటుంది. పోలీసు అధికారులకు ప్రాథమిక వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. అయితే, ఆర్మీ అధికారుల కంటే పోలీసు అధికారులు కొంచెం తక్కువ అలవెన్సులు పొందవచ్చు. ఒక పోలీసు కానిస్టేబుల్ జీతం సుమారు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు ఉంటుంది. ఒక డీఎస్పీ దాదాపు 80,000 నుండి 1,00,000 వరకు జీతం పొందవచ్చు. అదే సమయంలో ఐజీ వంటి ఉన్నత స్థాయి అధికారులు రూ.1,50,000 నుంచి రూ.2,00,000 వరకు జీతం పొందవచ్చు.
పారామిలటరీ దళంలో జీతం
పారామిలటరీ దళంలో జీతం కూడా ర్యాంక్ , అనుభవాన్ని బట్టి మారుతుంది. CRPF, BSF, ITBP వంటి పారామిలటరీ దళాలలో జీతం నిర్మాణం ఆర్మీ, పోలీసుల మాదిరిగానే ఉంటుంది. పారామిలటరీ దళంలోని అధికారులకు ప్రాథమిక వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. పారామిలటరీ దళంలో కానిస్టేబుల్ లేదా జవాన్ జీతం రూ. 25,000 నుండి రూ. 35,000 మధ్య ఉంటుంది, ఇది వారి పోస్ట్, అనుభవాన్ని బట్టి మారవచ్చు. కమాండెంట్ వంటి ర్యాంకింగ్ అధికారి జీతం రూ. 75,000 నుండి రూ. 1,00,000 మధ్య ఉంటుంది. డిప్యూటీ కమాండెంట్ లేదా జోనల్ కమాండర్ జీతం రూ. 1,00,000 వరకు ఉంటుంది.
జీతం పోలిక
మనం జీతాల కోణంలో మాత్రమే పరిశీలిస్తే.. పారా మిలటరీ దళాలలో అత్యున్నత ర్యాంక్‌లో ఉన్న అధికారులు, ప్రత్యేకించి CRPF, BSF, CISF వంటి బలగాల ప్రత్యేక అధికారులు అత్యధిక జీతం పొందుతారు. వీరిలో చాలా మంది అధికారుల జీతం రూ. 1,00,000 నుండి రూ. 1,50,000 వరకు ఉంటుంది, ఇది పోలీసు, ఆర్మీ అధికారుల కంటే ఎక్కువ. అయితే, ప్రారంభ సైనికుల జీతం ఆర్మీ, పోలీసులది సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది, ఇది రూ. 25,000 నుండి రూ.35,000 మధ్య ఉంటుంది.