జాతీయ వార్తలుమమత నియోజ‌క‌వ‌ర్గం అదేనా?

మమత నియోజ‌క‌వ‌ర్గం అదేనా?

Mamata

బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ అఖండ విజ‌యం సాధించింది. ఎన్నిక‌లు జ‌రిగిన 292 స్థానాల్లో ఏకంగా 213 సీట్లు గెలుచుకొని అబ్బుర ప‌రిచింది. కానీ.. ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నుంచి బ‌రిలో నిలిచిన మ‌మ‌త.. సువేందు అధికారికి చేతిలో స్వ‌ల్ప తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఈ ఫ‌లితంపై ఆరోప‌ణ‌లు చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ.. ముఖ్య‌మంత్రిని తానే అవుతాన‌ని ప్ర‌క‌టించారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోయినా ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చొవ‌చ్చు. అయితే.. ఆరు నెల‌ల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉంటుంది. దీంతో.. మ‌మ‌తా బెన‌ర్జీ ఎక్క‌డి నుంచి మ‌ళ్లీ పోటీ చేయ‌బోతున్నారు అనే ఆస‌క్తి నెలకొంది.

ప్ర‌స్తుతం బెంగాల్లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఖ‌ర్దాహా, జంగీపూర్, శంషేర్ గంజ్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ ముగ్గురు అభ్య‌ర్థులు చ‌నిపోయారు. జంగీపూర్‌, శంషేర్ గంజ్ అభ్య‌ర్థులు నామినేషన్ వేసిన త‌ర్వాత చ‌నిపోయారు. ఖ‌ర్దాహా అభ్య‌ర్థి మాత్రం పోలింగ్ ముగిసిన త‌ర్వాత ప్రాణాలు కోల్పోయారు.

విచిత్రంగా.. చ‌నిపోయిన అభ్య‌ర్థే ఎన్నిక‌ల్లో గెలిచారు. ఆ అభ్య‌ర్థి కూడా తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ మూడు స్థానాలు మ‌మ‌త పోటీ చేయ‌డానికి అవ‌కాశం ఉంది. అయితే.. ఖ‌ర్దాహా స్థానంలో తృణ‌మూల్ గెలిచింది కాబ‌ట్టి.. అక్క‌డి నుంచే పోటీ చేయొచ్చ‌ని అంటున్నారు. మ‌రి, ఏ స్థానం నుంచి మ‌మ‌త బ‌రిలో నిలుస్తార‌న్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...