https://oktelugu.com/

NTR Kodali nani: ఎన్టీఆర్ ప్రియుశిష్యులైన కొడాలి నాని, వంశీకి విభేదాలు ఎక్కడ వచ్చాయి? ఎందుకు విడిపోయారంటే?

NTR Kodali nani: పైకి ఎంత టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో తమకు సంబంధాలు లేవన్నా సరే.. లోపల మాత్రం ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దగ్గరి సాన్నిహిత్యమే ఉంది. అయితే ఇప్పుడు వీరి మధ్య తొలిసారి విభేదాలు వచ్చాయి. అటు ఎన్టీఆర్.. ఇటు నాని, వంశీలు డిఫెన్స్ లో పడిపోయారు. దీనికి కారణం.. ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టిన వ్యవహారంలో ఎన్టీఆర్ స్పందించిన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2021 / 09:01 AM IST
    Follow us on

    NTR Kodali nani: పైకి ఎంత టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో తమకు సంబంధాలు లేవన్నా సరే.. లోపల మాత్రం ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దగ్గరి సాన్నిహిత్యమే ఉంది. అయితే ఇప్పుడు వీరి మధ్య తొలిసారి విభేదాలు వచ్చాయి. అటు ఎన్టీఆర్.. ఇటు నాని, వంశీలు డిఫెన్స్ లో పడిపోయారు. దీనికి కారణం.. ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టిన వ్యవహారంలో ఎన్టీఆర్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది.

    ntr kodali nani vamshi

    టీడీపీ తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన తీరు వైసీపికి అనుకూలంగా ఉందని ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు.. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలు ఎన్టీఆర్ కుమార్తెపై నీచమైన భాషను మాట్లాడితే.. కుటుంబ పరువును కాపాడడంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు విఫలం అయ్యారని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీంతో ఎన్టీఆర్ డిఫెన్స్ లో పడిపోయాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తీరు ఉందని.. స్వయంగా తాత ఎన్టీఆర్ కూతురును తిడితే సరిగ్గా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తిపోస్తోంది.

    Also Read: జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం మాత్రమే.. ఏమీ లేదని నాని కీలక వ్యాఖ్యలు

    ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చారు. వంశీ మీడియాతో మాట్లాడలేదు కానీ.. కొడాలి నాని మాత్రం కవర్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబును యథావిధిగానే తిట్టిపోసిన నాని.. ఈ క్రమంలోనే ఈ వివాదంలో ఇరుక్కున్న జూనియర్ ఎన్టీఆర్ తో అసలు తమకేం సంబంధాలు లేవని ప్రకటించారు. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ తో సంబంధాలుండేవని.. తర్వాత చెడిపోయాయనని.. తమ నాయకుడు జగన్ అని.. తాము ఎన్టీఆర్ చెబితే ఎందుకు నోరు మూసుకుంటామని ప్రశ్నించారు.

    తెలుగుదేశం పార్టీకి టార్గెట్ గా మారిన ఎన్టీఆర్ ను సేవ్ చేయడానికి మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ రంగంలోకి దిగారని తెలుస్తోంది. జగన్ మా దేవుడు అని.. ఎన్టీఆర్ తో సంబంధాలు లేవన్న కొడాలి నాని, వంశీ మరి చంద్రబాబును బండబూతులు తిడుతూ జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టకపోవడం ఇక్కడ అందరికీ అనుమానం కలిగిస్తోంది. ఎన్టీఆర్ ను పల్లెత్తు మాట అనకపోవడంతో నాని, వంశీ కవర్ చేస్తున్నారని అర్థమవుతోంది. పైకి విభేదాలు అని చెబుతున్నా వీరి మధ్య సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ను కాపాడేందుకే ఇలా కవర్ చేశారని తెలుస్తోంది.

    చంద్రబాబు రాజకీయంలో ఎన్టీఆర్ బలి కాకుండా ఉండేందుకే కొడాలి నాని, వంశీ ఇలా మాట్లాడరని.. తమకు ఎన్టీఆర్ తో సంబంధం లేదని అన్నారని తెలుస్తోంది.

    Also Read: టీడీపీ నేతలకు జూ.ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? అసలు కథేంటి?