Visakhapatnam as an IT hub: విశాఖను( Visakhapatnam) ఐటి హబ్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో చాలా వరకు విజయవంతం అయింది. ఎప్పుడైతే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో అప్పటినుంచి అనుబంధ సంస్థలు రావడం ప్రారంభించాయి. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్.. ఇలా చాలా సంస్థలు కార్యకలాపాలను మొదలుపెట్టాయి. కొన్నింటి భవనాల శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. మిగతా సంస్థలు సైతం సొంత కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నం అయ్యాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో అడ్డు తగులుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. భూముల సేకరణను అడ్డగించే ప్రయత్నం చేస్తోంది. కొంతమంది వ్యక్తులతో కోర్టులో పిటిషన్లు వేయిస్తోంది. అయితే దాని వాదనలు వినిపించే బాధ్యతను ఆస్థాన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కి అప్పగించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ప్రభుత్వ వకీలుగా ఉన్న సుధాకర్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాయర్ గా మారిపోయారు. అయితే హై ప్రొఫైల్ కేసులన్నీ నిరంజన్ రెడ్డి లాంటి లాయర్లు వాదిస్తుండగా.. ఇటువంటి కేసులన్నీ పొన్నవోలుకు అప్పగించారు.
చిన్న లాయరు గట్టి పేరు..
చంద్రబాబు( CM Chandrababu) అరెస్టు సమయంలో ఆయన పేరు ఎంత మార్మోగిందో తెలుసు. కానీ ఆయనతో సమానంగా పేరు వచ్చింది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి. అప్పటివరకు ఆయన ప్రభుత్వ వకీలు మాత్రమే. కేవలం లాయర్లతోపాటు న్యాయ వర్గాల వారికి ఆయన పేరు సుపరిచితం. మిగతా వారికి ఆయన ఎవరో కూడా తెలియదు. కానీ కనీసం ఆధారాలు లేని కేసులకు సంబంధించి ఆయన వాదన అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఏకంగా సుప్రీంకోర్టు లాయర్లు సైతం తన ఎదుట చిన్నవారే అన్నట్టు పొన్నవోలు ప్రవర్తన ఉండేది. అయితే ఇప్పుడు అదే పొన్నవోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ను లీడ్ చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం తప్పుడు పిటీషన్లు వేయించి వాదనలు వినిపిస్తున్నారు. విశేషమేమిటంటే ఆయన వాదించిన కేసులన్నీ కోర్టుల్లో నిలబడడం లేదు.
చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి..
విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ పరిశ్రమలు తరలివస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు వస్తుండడంతో అనతి కాలంలోనే విశాఖ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ సమయంలో భూ సేకరణలో చిన్న చిన్న లోపాలు జరగడం సహజం. కానీ దానిని హైలెట్ చేస్తూ కోర్టు కేసులు వేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విద్యగా మారిపోయింది. అయితే దీనిపై నారా లోకేష్ సీరియస్ గానే ఉన్నారు. తాము ఐటీ ని అభివృద్ధి చేస్తామంటే వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అయితే పొన్నవోలు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఆయన వాదనలను కోర్టు అభిప్రాయాలుగా సూచిస్తోంది. సాక్షి మీడియా. అదే పనిగా కథనాలు ప్రచురిస్తోంది. విశాఖకు ఐటి పరిశ్రమలు రాకుండా తన వంతు సహకారం అందిస్తోంది. అయితే వీటిని లెక్క చేసే పనిలో లేవు ఐటీ పరిశ్రమలు. ఎందుకంటే ఎలాగూ ఈ సమస్యకు పరిష్కారం చూపి తమకు ఒక మార్గం చూపుతారన్న నమ్మకం చంద్రబాబుతో పాటు లోకేష్ పై ఉంచాయి. అందుకే ఏకంగా శంకుస్థాపనలకే మొగ్గుచూపుతున్నాయి. పొన్నవోలు లాంటి లాయర్ల ప్రయత్నాలు వృధాప్రయాస అని తేలిపోతోంది.