
ప్రస్తుత కాలంలో ఏ రంగంలోనైనా మహిళల పాత్ర కీలకం. చాలా రంగాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే తమ పనితనంతో మెప్పిస్తున్నారు. సమాజంలో నేటికీ పలు రంగాల్లో మహిళలపై చిన్నచూపు ఉంది. అయితే ఆ పరిస్థితులు మారడానికి ఎంతో సమయం పట్టేలా లేదు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో మహిళలే చక్రం తిప్పుతున్నారు. వీరిలో కొంతమంది కొంతకాలం రాజకీయాల్లో కొనసాగితే మరికొందరు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహిళా నేతలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన మహిళా నేతలు ప్రస్తుతం రాజకీయాల్లో ఎందుకు యాక్టివ్ గా లేరో ఎవరికీ తెలియడం లేదు. సమైక్యాంధ్రప్రదేశ్ లో ఎంపీలు కిల్లి కృపారాణి, కొత్తపల్లి గీత, పనబాక లక్ష్మి చక్రం తిప్పారు.
దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి కేంద్ర మంత్రులుగా పని చేశారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ మహిళా నేతలు మరో పార్టీలోకి జంప్ చేశారు. పార్టీలు మారినా వీరి జాతకాలు మారకపోవడం గమనార్హం. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పురంధేశ్వరి కొంతకాలం యాక్టివ్ గానే ఉన్నా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఆమెకు బీజేపీ అధ్యక్ష పదవి దక్కకపోవడం వల్లే సైలెంట్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మాజీ సీఎం నేదురమల్లి జనార్థనరెడ్డి వర్గానికి చెందిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్న పనబాక లక్ష్మి కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఉమ్మడి ఏపీలో కీలక నేత వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాల్లో ఎందుకు యాక్టివ్ గా లేరో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. మాజీ శ్రీకాకుళం ఎంపీ కిళ్లి కృపారాణి ఎన్నికల్లో ఓటమి అనంతరం సైలెంట్ అయ్యారు. ఆమె వైసీపీలో ఉన్నా పార్టీ నేతలు ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారడం వల్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి రాజకీయాల్లో సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.