AP PRC Peeta Mudi: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమస్యలు తీరడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. దీంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పీఆర్సీ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఉద్యోగులు సహనంగా ఉండాలని సూచిస్తున్నారు
పీఆర్సీపై మరోమారు ఉద్యోగులతో సమావేశం కావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పీఆర్సీ ప్రకటన ఇప్పట్లో వచ్చే వీలు లేదని సమాచారం. ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెబుతున్నారు. అధికారుల కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం పునరాలోచనలో పడిందనే తెలుస్తోంది.
Also Read: పీఆర్సీపై జగన్ కీలక భేటీ.. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేనా?
ఉద్యోగులు 45 శాతం ఫిట్ మెంట్ కావాలని అడుగుతున్నా ప్రభుత్వం అంత మొత్తంలో ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన క్రమంలో ప్రభుత్వం మాత్రం ఎంత మేర ఇస్తుందోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎంత మేర ఇస్తుందోననే ఆశ ఉద్యోగుల్లో నెలకొంది.
ప్రస్తుతం రాష్ర్టంలో ఉద్యోగులు అడిగినంత ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల్లో సమన్వయం కొరవడినట్లు తెలుస్తోంది. అందుకే పీఆర్సీ ప్రకటన ఆలస్యమవుతుందని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో కొత్త సంవత్సరంలో ఉద్యోగుల ఆశలు తీరుతాయో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.