విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను కేంద్రం తొక్కిపెట్టిందని, ప్రత్యేక హోదాతోపాటు ఎన్నో రాయితీలను నిలిపేసిందని రాజకీయ పార్టీలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆలా వరకూ నిజాలే ఉన్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏపీ బాకీ ఉందని, ఆ సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారని కేంద్రం సాక్షాత్తూ పార్లమెంటులో అడగడం విశేషం!
Also Read: పోతిన మహేష్ తో ఉన్న గొడవ గురించి క్లారటీ…
అసలు విషయం ఏమంటే.. పార్లమెంటులో రైల్వే బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు.. కేంద్రంపై విమర్శలు చేశారు. తమ రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయట్లేదని, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయని అన్నారు.
దీనికి స్పందించిన రైల్వే మంత్రి గోయల్ కొత్త పాయింట్ ను తెరపైకి తెచ్చారు. ఏపీలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులు కేంద్ర-రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టినవని, వీటికి రాష్ట్రం వాటాగా రూ.1200 కోట్లను ఏపీ ఇవ్వాల్సి ఉందని అన్నారు. ముందు ఈ మొత్తాన్ని ఇప్పించాలని వైసీపీ ఎంపీలను కోరారు మంత్రి. దీంతో.. అవాక్కవడం వారి వంతైంది.
Also Read: బుద్దా వారి బూతు పురాణం…ఆడియో లీక్
ఏపీలో రైల్వే ప్రాజెక్టలన్నీ నత్తనడకన సాగుతున్న విషయం వాస్తవమే. అయితే.. కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయట్లేదు. రాష్ట్రాలనూ వాటా అడుగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ వాటా ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయంటూ పరోక్షంగా ప్రకటించింది. దీని ఫలితంగానే రైల్వే అభివృద్ధి పనులు స్తంభించిపోయాయనే విషయం స్పష్టమవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్