https://oktelugu.com/

బాలయ్య ‘అఖండ’ సంస్కృత పండితుడా?

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో రాబోతున్న చిత్రం అఖండ. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇటీవల రిలీజ్ చేసిన ఈ గెటప్ కు మంచి స్పందన వచ్చింది. అయితే.. తాజాగా ఈ పాత్ర గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్యకు పాటలు పాడడమంటే మహా సరదా అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మధ్య విశాఖ తుఫాను బాధితుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ పై […]

Written By: , Updated On : June 6, 2021 / 09:21 AM IST
Follow us on

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో రాబోతున్న చిత్రం అఖండ. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇటీవల రిలీజ్ చేసిన ఈ గెటప్ కు మంచి స్పందన వచ్చింది. అయితే.. తాజాగా ఈ పాత్ర గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

బాలయ్యకు పాటలు పాడడమంటే మహా సరదా అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మధ్య విశాఖ తుఫాను బాధితుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ పై ఓ పాట పాడి అందరినీ అలరించారు. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్ నటించిన చిత్రంలోని ‘శివశంకరీ..’ అనే వీణపాట ఆలపించారు. ఈ మధ్యనే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరికీ ‘శ్రీరామ దండకం’ వినిపించారు. ఇప్పుడు అఖండ సినిమాలోనూ ఈ తరహా విందు ఉందట!

ఈ చిత్రంలోని అఘోరా పాత్రలో బాలయ్య సంస్కృత శ్లోకాలను గుక్క తిప్పుకోకుండా పలికిస్తుంటారట. ఒక్క సీన్ లో కాదు.. ఆయన డైలాగుల్లో చాలా వరకు ఈ సంస్కృత శ్లోకాలే ఉంటాయని సమాచారం. అంతేకాదు.. ఈ శ్లోకాలను పాడిన తర్వాత వాటి అర్థాలను కూడా వివరించి చెబుతారట.

జూన్ 10న బాలయ్య బర్త్ డే. ఈ సందర్బంగా అఖండ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ఉండబోతోందని అంటున్నారు. వాస్తవానికి ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ.. కరోనా కండీషన్లో ట్రైలర్ కట్ చేయడం కుదరలేదు. అందుకే.. పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని టాక్.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండడం.. అందులో ఒకటి ఇప్పటి వరకు కనిపించని అఘోరా పాత్ర కావడం.. అందులోనూ బాలయ్య గాత్రం వినిపించబోతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గితే.. ఈ మూవీని జులైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.