Upasana- Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫామిలీ కి ఎలాంటి స్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ కుటుంబం నుండి వచ్చిన ప్రతి ఒక్క హీరో ఇండస్ట్రీ లో సక్సెస్ సాధించారు..కానీ పొలిటికల్ పరంగా మాత్రం మెగా ఫామిలీ కి ఆశించిన స్థాయిలో అచ్చిరాలేదని చెప్పాలి..చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లోకి కలిపినా తర్వాత ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించి 2019 వ ఎన్నికలలో ఓడిపోయాడు..ఓడిపోయినప్పటికీ కూడా దృడంగా నిలబడి ఇప్పుడు పార్టీ ని క్షేత్ర స్థాయి నుండి నిర్మించాడు..ఇవన్నీ పక్కన పెడితే..గాడ్ ఫాదర్ ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక డైలాగ్ ఉంటుంది..’రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను..కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు’ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ కి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే.

ఆ డైలాగ్ మెగాస్టార్ నిజ జీవితం ని ఉద్దేశించే రాసినట్టు ఉంది..ఎందుకంటే ఆయన రాజకీయాలకు దూరమయ్యి సుమారు 10 ఏళ్ళు కావొస్తుంది..కానీ ఇప్పటికి ఆయన పలానా పార్టీ లో చేరబోతున్నాడంటూ రోజు ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది..టాలీవుడ్ లో టికెట్ రేట్స్ సంక్షోభం వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ గారిని కలిసి ఆ సమస్య ని పరిష్కరించాడు..ఆ సమయం లో చిరంజీవి వైసీపీ పార్టీ లో చేరబోతున్నాడని..ఆయనకీ జగన్ రాజ్య సభ సీట్ ఆఫర్ చేసాడని టాక్ వినిపించింది..దీనికి స్వయంగా చిరంజీవి స్పందించి అలాంటిది ఏమి లేదని చెప్పుకోవాల్సిన పరిసితి ఏర్పడింది.

ఆ తర్వాత మళ్ళీ ఆయన బీజేపీ పార్టీ లో చేరబోతున్నాడని కొంతమంది..జనసేన పార్టీ లో చేరబోతున్నాడని మరికొంతమంది ప్రచారం చేస్తూ వచ్చారు..ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవి గారి కోడలు ఉపాసన కొణిదెల ని కూడా రాజకీయాల్లోకి లాగేసారు..ఈమె TRS పార్టీ నుండి పోటీ మల్కాజ్ గిరి స్థానం నుండి పోటీ చెయ్యబోతున్నారు అంటూ గత కొద్దీ రోజుల నుండి ఒక వార్త వినిస్తుంది..ఇదే విషయాన్నీ ఈరోజు జరిగిన గాడ్ ఫాదర్ మూవీ ప్రెస్ మీట్ లో చిరంజీవి ముందు ప్రస్తావించగా ‘ఈ స్టోరీలు ఎవరో అద్భుతంగా సృష్టిస్తున్నారు..మంచి టాలెంట్ ఉంది..ఇండస్ట్రీ కి వస్తే బాగా పైకి వస్తారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.