
తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి రోజురోజుకు దిగజారుతోంది. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడోస్థానానికి చేరుకోవడంతో ఇక కోలుకోవడం కష్టమేనని అంటున్నారు. దుబ్బాక నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఈ నియోజకవర్గంలో తాము రెండో స్థానంలో ఉన్నామని, దీంతో ఎలాగైనా నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలని అనుకున్నారు.
Also Read: ‘దుబ్బాక ఉప ఎన్నిక’: హరీశ్ రావుకే బాధ్యతల వెనుక..?
దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు చెరుకు శ్రీనివాసరెడ్డి మద్ధతు ఉండేది. శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా ఓటు బ్యాంకు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ లోకి తీసుకొని టికెట్ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఓట్లు చీలడంతో విజయం తమదేనని భావించారు.
ఈ తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జ్ ఠాగూర్ నేత్రుత్వంలో మండలానికో కీలక నాయకుడిని ఉంచి ప్రచారం చేయించారు. ఎలాగైనా సీటును కైవసం చేసుకోవాలని తాపత్రాయ పడ్డారు. కేసీఆర్ ను కాకుండా హరీశ్ రావు పెత్తనం దుబ్బాకపైన ఎందుకని లోకల్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే అందుబాటులో ఉంటాడని ప్రచారం చేశారు.
Also Read: రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?
అనుకోకుండా బీజేపీకి నగదు పట్టివేత సంఘటన కలిసొచ్చింది. ఈ పరిణామంను ప్రచారంగా వాడుకున్న బీజేపీ టీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే అప్పటి వరకు పెద్దగా పట్టించుకోని కేసీఆర్ సైతం బీజేపీపై విమర్శలు చేయడంతో మరింతగా ఆ పార్టీకి లాభా పడింది. ఈ సమయంలో ప్రజలు కాంగ్రెస్ ను మరిచిపోయారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
దీంతో కాంగ్రెస్ మూడో ప్లేసుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ కు టైం కలిసి రాలేదని కొందరు అంటుండగా నాయకత్వలేమి అని మరి కొందరు వాదించుకుంటున్నారు. ఏదీ ఏమైనా కాంగ్రెస్ లో కలిసికట్టుగా లేకపోవడంతోనే పార్టీ ఇలా తయారైందని సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే అనూహ్య సంఘటనలేవైనా కాంగ్రెస్ కలిసొస్తాయా.. అన్నది చూడాలి..