https://oktelugu.com/

Huzurabad By Election Result: వరుసగా ఏడోసారి ఈటల ఎలా గెలిచాడు? అసలు కారణాలేంటి?

Huzurabad By Election Result: తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఈటల రాజేందర్ ఓటమి అన్నదే ఎరుగకుండా వరుసగా గెలుస్తూ హుజూరాబాద్ ను తన కంచుకోటగా మలుచుకున్నాడు. సాధారణంగా బైపోల్ లో అధికార పార్టీదే హవా ఉంటుంది. కానీ కేసీఆర్ బర్తరఫ్ చేస్తే బయటకు వచ్చి ఎదురించి పోటీచేసిన ఈటల ఊహించని విధంగా ఘనవిజయం సాధించారు. హుజూరాబాద్ లో మరోసారి విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ పై చాలెంజ్ చేసి మరీ ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2021 / 10:37 AM IST
    Follow us on

    Huzurabad By Election Result: తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఈటల రాజేందర్ ఓటమి అన్నదే ఎరుగకుండా వరుసగా గెలుస్తూ హుజూరాబాద్ ను తన కంచుకోటగా మలుచుకున్నాడు. సాధారణంగా బైపోల్ లో అధికార పార్టీదే హవా ఉంటుంది. కానీ కేసీఆర్ బర్తరఫ్ చేస్తే బయటకు వచ్చి ఎదురించి పోటీచేసిన ఈటల ఊహించని విధంగా ఘనవిజయం సాధించారు. హుజూరాబాద్ లో మరోసారి విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ పై చాలెంజ్ చేసి మరీ ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

    etela rajender wins

    ‘ఆత్మగౌరవం-అహంకారం’ నినాదం పేరుతో జరిగిన ఈ ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు మళ్లీ ఈటలకే జీహుజూర్ అన్నారు. గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గినా.. విజయం మాత్రం దక్కించుకున్నారు. బీజేపీ పార్టీ కన్నా.. వ్యక్తిగత ఇమేజ్ యే ఈటలను బయటపడేసిందని చెబుతున్నారు.

    ఇప్పటికే హుజూరాబాద్ నుంచి 6 సార్లు ఈటల రాజేందర్ గెలిచారు. ఈసారి 7వ సారి కూడా ప్రజామోదంతో విజయదుందుభి మోగించారు. ఈటల విజయంలో అసలు కీలక పాత్ర పోషించిన అంశాలేంటో చూద్దాం..

    -ప్రధానంగా సానుభూతి పవనాలు ప్రజల్లో ఈటలపై బలంగా వీచాయి. ఆత్మగౌరవ నినాదం పనిచేసింది. మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేయడంతో ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి వ్యక్తమైంది.కేసీఆర్ ను ఎదురించి వచ్చాడన్న ఆత్మగౌరవ నినాదం పనిచేసింది.

    -ఇక ఈటల రాజేందర్ కు నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు.. నీట్ వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ అయ్యింది. స్థానికుడు.. అందుబాటులో ఉండే నేత కావడంతో ప్రజలు పట్టం కట్టారు.

    -కేంద్రంలోని బీజేపీ తీరు.. పెట్రోల్, గ్యాస్ , నిత్యావసరాల ధరాఘాతం ఈటలకు మైనస్ అవుతుందనుకున్నారు. టీఆర్ఎస్ అదే ప్రచారం చేసినా ఈటలపై మాత్రం ఆ ఎఫెక్ట్ పడలేదు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ యే అక్కడ పనిచేసింది.

    -రాజీనామా చేశాక పాదయాత్ర చేపట్టడం.. ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉండడంతో ఈటలకు ప్రజాభిమానం దక్కింది. ఇంటింటికి వెళ్లి ప్రతీ ఓటరును కలవడం ప్లస్ అయ్యింది.

    -నియోజకవర్గంలో బీసీ ఓట్లు గంపగుత్తగా ఈటలకు పడ్డాయి. ఆయన భార్య రెడ్డి సామాజిక వర్గం ఓట్లను సంపాదించింది. దీంతో ఈటల గెలుపు సులువైంది.

    -బలహీనమైన ‘గెల్లు శ్రీనివాస్’
    ఈటల రాజేందర్ తో పోల్చితే బలహీనమైన అభ్యర్థి, విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ నిలవలేకపోయారు. పెద్ద నేత కాకపోవడం.. అంతకుముందు ప్రజలంతో సత్సబంధాలు లేకపోవడం టీఆర్ఎస్ అభ్యర్థికి మైనస్ గా మారింది. ఈటలకు అదే లాభమైంది.

    -కాంగ్రెస్ పోటీచేసినా నామమాత్రపు అభ్యర్థిని పెట్టింది. పోయిన ఎన్నికల్లో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ఈటలకు పోటీనిచ్చింది. ఈసారి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం ఈటలకు మళ్లి విజయం దక్కింది.

    -దళితబంధుతో దళితులు హ్యాపీగా ఉన్నా బీసీలు, రెడ్డి సామాజికవర్గం, ఇతరులు రగిలిపోయారు. వారంతా బీజేపీ వైపు తిరగడం.. ఈటలకు ఓటు వేయడంతో గెలుపు సులువైంది.

    -ఈటల రాజేందర్ కు నియోజకవర్గంపై బాగా పట్టుంది. ఆరు సార్లు గెలిచి ప్రతీ ఒక్కరికి చేరువయ్యారు. సొంత మండలం కమలాపూర్ లో తిరుగులేని ఆధిపత్యం లభించింది. స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేయడంతో విజయం దక్కింది.

    -ఈటలకు నియోజకవర్గంలో బలమైన వర్గాలు అండగా నిలిచాయి. ఆయనకు వ్యాపారులు, రైతులు, కులసంఘాల నేతలు పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపడంతో విజయం నల్లేరుపై నడకలా సాగింది.