భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. పలు దేశాధినేతలను కలుస్తూ సంభాషణలు చేస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భేటీలు అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ లను కలుస్తూ రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుకు చర్యలు చేపడుతున్నారు. కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాధినేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ తాత పీవీ గోపాలన్ హస్తకళకు సంబంధించిన చెక్క బొమ్మను ప్రధాని మోడీ ఆమెకు బహుమతిగా అందజేశారు. గులాబీ మీనాకారి చెస్ సెట్ ను కూడా ఆమెకు బహుకరించారు. దేశంలోని పురాతన నగరాల్లోని హస్తకళను ప్రతిబింబించే అద్భుత కళాఖండాలను మోడీ ఆమెకు అందించడంతో ఆనందం వ్యక్తం చేశారు. బొమ్మల్లోని ప్రతి భాగం హస్తకళతో ఉట్టిపడుతోంది.
కమలా హారీస్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం అంటే మాటలు కాదు. ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప ఈ ఘనత దక్కదు. ఈ నేపథ్యంలో ఆమె ప్రతిభను ప్రదాని మోడీ ప్రశంసించారు. ఎందరో మహిళలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని కొనియాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ప్రధాని మోడీ విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో క్వాడ్ దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. వారికి కూడా ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఆస్రేలియా ప్రధాని మోరిసన్ కు వెండితో చేసిన మీనకారీ నౌకను బహుమతిగా ఇచ్చారు. జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపు బుద్ధ విగ్రహాన్ని కానుకగా సమర్పించారు. భారత్, జపాన్ సంబంధాల్లో నూతన శకం కావాలని భావిస్తోంది.