Homeఆంధ్రప్రదేశ్‌Gautam Adani- Jagan: జగన్ రెడ్డితో గౌతం అదానీ సీక్రెట్ భేటి కథేంటి?

Gautam Adani- Jagan: జగన్ రెడ్డితో గౌతం అదానీ సీక్రెట్ భేటి కథేంటి?

Gautam Adani- Jagan: ఏపీ సీఎం జగన్ పూర్వాశ్రమంలో పారిశ్రామికవేత్త. అయితే కష్టపడి పరిశ్రమలు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్త కాలేదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పారిశ్రామికవేత్తగా మారారని ఇప్పటికీ విపక్షాల ఆరోపిస్తుంటాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పారిశ్రామికవేత్త గా మారారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పారిశ్రామికవేత్తలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. గతంలో తన తండ్రి మరణానికి కారణమయ్యారని ఆరోపించిన వారి సిఫార్సుల మేరకు పదవులు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. ఇక అదానీ గ్రూప్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో ఎన్ని ఆస్తులు కట్టబెట్టారో చెప్పాల్సిన పనిలేదు. గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి విశాఖలో డేటా సెంటర్ పేరుతో కొండల్ని కట్టబెట్టేశారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా ఇచ్చేయాలనుకున్నారు. కానీ అదానీ సమస్యల్లో ఇరుక్కోవడంతో వెనక్కి తగ్గారు.

చంద్రబాబు ప్రభుత్వం ఇదే అదానితో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటే.. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర సంపదను అదానికి కట్టబెడుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేసేవారు. తీరా అధికారంలోకి వచ్చాక అదే అదానీ గ్రూప్ జగన్కు ముద్దుగా మారింది. అత్యంత దగ్గర బంధువు అయింది. అస్మదీయ కంపెనీగా మారింది. పేరు మోసిన కాంట్రాక్టులన్నీ ఆ కంపెనీయే దక్కించుకుంది. అయితే జాతీయస్థాయిలో అదా నీ కంపెనీ అనేక సమస్యల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ అవేవీ జగన్ బంధానికి ప్రతిబంధకంగా మారలేదు. జగన్కు అత్యంత వీర విధేయ అస్మదీయ కంపెనీగా అదానీ గ్రూప్ మారింది. చెక్కుచెదరని అభిమానాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ఏపీ సీఎం జగన్ కలిశారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ఆయన.. నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య గంటలు తరబడి చర్చలు జరిగాయి. అయితే గౌతం అదాని ఏపీలో రహస్య పర్యటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు సీక్రెట్ మీటింగ్స్ జరిగాయి. ఇలా వచ్చే క్రమంలో ఎందుకు వచ్చారు? సీఎంతో ఏం చర్చించారు? అన్న విషయాలు మాత్రం బయటికి రావు. వచ్చింది వ్యక్తిగత పనిమీద? ప్రభుత్వ పని మీద? అన్నది సీఎంవో సైతం స్పష్టత ఇవ్వదు. తాజా పర్యటన సైతం ఎందుకు అన్నది ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు.

ఆదాని రాకతో సామాన్య జనాలకు చుక్కలు చూపించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చారు. వీవీఐపీ హోదాలో తాడేపల్లి కి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గౌతమ్ అదాని సీఎం జగన్ ను కలిసినట్లు వెల్లడయ్యింది. అంతేతప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ సీక్రెట్ మీటింగ్ వెనక ఉన్న కథ ఏంటి అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే సాంప్రదాయేతర విద్యుత్ ఒప్పందాల పేరుతో అదానికి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. ఈ తరుణంలో మిగతా ప్రాజెక్టుల గురించి చర్చించేందుకే అదాని తాడేపల్లి వచ్చి ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెడుతున్నారా? అమ్ముతున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ అదానీ కలిశారంటే ఏదో విషయం లేకపోదు అన్న చర్చ అయితే ఒకటి జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular