Bigg Boss Manas-Talasani Yadav: బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఇంట్రెస్టింగ్ గేమ్స్ తో షోలోని పోటీదారుల మధ్య మంచి గేమ్స్ ఉంటాయి. అవి ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయి. ఈ క్రమంలో షోలో పాల్గొన్న వాళ్ళు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే, గత సీజన లో మానస్ ఆటతీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

ఎంతగానో మానస్ ఆకట్టుకున్నాడు. మొత్తమ్మీద ఒక స్టార్ హోదా లో హౌస్ లో నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నాడు. అయితే, తాజాగా బిగ్ బాస్ షోలో మానస్ ప్రదర్శనకు మెచ్చి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్సనల్ గా కలిశారు. కలిసి మానస్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో లో మానస్ ఆట తీరు నాకు పర్సనల్ గా చాలా నచ్చింది.
మానస్ ప్రవర్తన మొదటి నుంచి ఎంతో హుందాగా ఉండటం నేను గమనించాను. తప్పకుండా మానస్ కి భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను. మానస్ కూడా మంచి అవకాశాలను సంపాదించుకుంటాడని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు మానస్. నువ్వు బాగా రాణించాలి, హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి’ అని మంత్రి తెలిపారు.
Also Read: దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?
ఇక మానస్ మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ లో నా ప్రయాణం చాలా సహజంగానే సాగింది. నేను బయట ఎలా ఉంటానో.. హౌస్ లో కూడా అలాగే ఉన్నాను. అయితే, నాకు బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నన్ను ఆశీర్వదించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అని మానస్ చెప్పుకొచ్చాడు.
అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ కి – మానస్ కి మధ్య లింక్ ఏమిటి ?
అసలు ఎప్పుడో ముగిసిన బిగ్ బాస్ షోకి ఇప్పుడు అభినందనలు ఏమిటి ? ఇంతకీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బిగ్ బాస్ షోను చూస్తారా ? మొత్తానికి నెటిజన్లు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మానస్ ఒక సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యాడు. ఆ సినిమా నిర్మాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సన్నిహితుడు అని, అందుకే.. మానస్ ను ఇలా అభినందించి ఉంటారని తెలుస్తోంది.
Also Read: రఘురామ వైసీపీకి రాజీనామా చేస్తారా?