Ananth Ambani : నువ్వే నువ్వే సినిమాలో ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి తరుణ్ ఓ మాట అంటాడు. ” అంకుల్… మీరు పరుపును కొనగలరు.. కానీ నిద్రను కొనలేరు” ఈ మాట ముఖేష్ అంబానీకి కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇటీవల తన కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్ జరిపించాడు. కానీ ఆ ఎంగేజ్మెంట్లో అన్ని బాగున్నప్పటికీ అనంత్ రూపమే గ్లేరింగ్ గా అనిపించింది.. అంతటి స్థూల కాయం అందమైన రాధిక పక్కన అదోలా కనిపించింది. ఎన్ని వేల కోట్ల డబ్బుంటే ఏముంది? అన్నీ డబ్బుతో కొనలేం కదా?

నిజానికి 208 కిలోల బరువున్న అనంత్ అంబానీ జస్ట్ 18 నెలల్లో 108 కిలోలు తగ్గాడు.. అప్పట్లో ఇది వైరల్..రోజూ ఎనిమిది కిలోమీటర్ల నడక, కీటో డైట్, ప్రత్యేకంగా శిక్షకులు, పండ్ల రసాలు, ప్రోటీన్ ఫుడ్, నో కార్బ్స్, ఇక ప్రకారం రోజు 1000 కిలో కేలరీలు దాటని ఆహారం. కానీ ఏమైంది? మునుపటి అనంతుడే కనిపిస్తున్నాడు.. ఏవో పద్దతుల్లో కష్టపడి, బరువు తగ్గడం కాదు, దాన్ని అలాగే మైంటైన్ చేయడమే ఇంకా కష్టమని నిజాన్ని అనంతుడి రూపం మనకు చెబుతుంది.
వాస్తవానికి అనంత్ ఆస్తమాతో బాధపడుతున్నాడు.. హై డోస్ స్టెరాయిడ్స్ వాడుతున్నాడు.. వాటి ప్రభావం వల్ల అతడు లావు అవుతున్నాడు అని చెబుతోంది అతని నీతూ అంబానీ. సరే అది కాకపోతే మరో అనారోగ్యం కావచ్చు గాక.. ప్రపంచంలో ఏ మూల ఎన్ని కోట్ల ఫీజు ఇచ్చయినా సరే తీసుకొచ్చి చికిత్స చేయించగల అంబానికి, ప్రపంచంలో టాప్ టెన్ ధనికుల్లో ఒకడైన అంబానికి, నిలబెట్టి ప్రభుత్వాలను కొనేయగలిగే అంబానికి… అతడి కొడుకు రూపం ఒక సవాల్. ఏమీ చేయలేడు.. చేయలేకపోయాడు.. దీన్నే విధి అంటారు.

అనంత్ కూడా నోటికి తాళం వేయలేడు అంటారు అతడి సన్నిహితులు.. అతనితోపాటు పుట్టిన ఈశా మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. గుజరాత్ వైశ్య కుటుంబానికి చెందిన అంబానీలు మాంసాహారం ముట్టరు. అనంత్ అంబానీ మాత్రం భారీగా లాగిస్తాడనే వాదనలు ఉన్నాయి.. అయితే అప్పట్లో డైట్ మెయింటైన్ చేసినప్పుడు అనంత్ పద్ధతిగా ఉండేవాడని, తర్వాత వాటిని అలాగే కొనసాగించలేక మళ్ళీ లావు అయ్యాడని ముంబై వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది.. ఇదే సమయంలో మొన్న జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకలో అనంత్ పక్కన రాధిక ఏమాత్రం ఆనలేదు. మన నాటు భాషలో చెప్పాలంటే సింహం పక్కన చిట్టెలుక లాగా ఉంది.