Amit Shah: చాలా నెలల తరువాత సదరన్ జోనల్ సమావేశం జరగనుంది. నిజానికి గత మార్చి నెలలలోనే ఈ సమావేశం నిర్వహించాలి. ఎన్నికల కారణంగా దానిని వాయిదా వేశారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షత వహించనున్నారు. ఈ సారి తిరుపతిలో నిర్వహించున్నాన్న ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ అతిథ్యం ఇవ్వనున్నారు. ఆయనే ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఇందులో పాల్గొంటాయి. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చింది, పరిష్కారినికి చర్యలు తీసుకుంటారు. అయితే తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ దీనికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో దీనిని రద్దు చేసుకుంటునట్టు తెలుస్తోంది. ఆయనకు బదులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీని పంపిచనున్నారు.

కారణాలేంటి ?
ఈ సదరన్ జోనల్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడానికి కారణాలు ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) హాజరువుతున్న ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన అంశాలపై గట్టి వాదన వినిపిస్తారు అని అందరూ అనుకున్నారు. తెలంగాణ అధికారులు సీఎం కేసీఆర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సిద్ధం చేసి ఇచ్చారు. కానీ ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం తెలియరావడం లేదు.
27 అంశాలు చర్చకు ?
ఈ సమావేశంలో మొత్తం 27 అంశాలు చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. సరిహద్దు వివాదాలు, అంతరాష్ట్రాల మధ్య ఇతర సమస్యలను ఇందులో చర్చిస్తారు. బొగ్గు కొరత వల్ల ఏర్పడ్డ కరెంటు కొరత, నీటి పంపకాలు వంటి విషయాలు ఇందులో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిల పంపకాలు, ఇతర పంపకాలు కూడా చర్చించనున్నారు. మూడు రాజధానుల అంశం, జల వివాదాలు, స్పెషల్ స్టేటస్ అంశం ఏపీ చర్చకు తీసుకురానుంది.
ఇప్పటికే ఆయా రాష్ట్రాలు దీనిపై కసరత్తు చేసుకున్నాయి. ఇందులో ఏం చర్చించాలని అనే విషయంపై వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలను ముందుగానే అజెండాలో పేర్కొన్నారు. అయితే అప్పటికప్పడు ఆయా రాష్ట్రాలు కొన్ని అంశాలు అక్కడ చర్చించాలని కోరవచ్చు. దానికి అధ్యక్షుడు అనుమిస్తే అప్పటికప్పుడు కూడా వాటిని చర్చిస్తారు. కావున మరి కొన్ని అంశాలు కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంటుంది. చాలా రోజుల తరువాత జరుగుతున్న సమావేశం కాబట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షించబోతోంది. నేషనల్ మీడియాకు కూడా ఈ సమావేశంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
Also Read: తెలంగాణలో వరి ‘పండుగ’నా..? ‘దండగ’నా..?
బీజేపీని బలపర్చేందుకు ఈటెల అడుగులు.. రేవంత్ ప్లాన్ కే బ్రేక్స్..