https://oktelugu.com/

Sarkaru vari pata: ఓవర్సీస్​లో భారీ రేటుకు అమ్ముడైన ‘సర్కారు వారి పాట’ రైట్స్​.. ఎంతో తెలుసా!

Sarkaru vari pata: సూపర్​స్టార్​ మహేశ్​ నుంచి సినిమా వస్తోందంటే చాలు ఆయన అభిమానులకు పండగే. థియేటర్లన్నీ రెండ్రోజుల ముందు నుంచే సందడిగా కనిపిస్తాయి. తాజాగా, మహేశ్​ నటిస్తోన్న సినిమా సర్కారు వారి పాట. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా పరశురామ్​ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా కనిపించనుంది. తొలిసారి మహేశ్​కో కలిసి ఈ మహానటి స్క్రీన్​ షేర్​ చేసుకోనుంది. బ్యాంకింగ్​ సెక్టార్​లో జరిగే కుంభకోణం నేపథ్యంలో తండ్రిని కాపాడుకునే కొడుగ్గా మహేశ్ ఈ […]

Written By: , Updated On : November 13, 2021 / 10:58 AM IST
Follow us on

Sarkaru vari pata: సూపర్​స్టార్​ మహేశ్​ నుంచి సినిమా వస్తోందంటే చాలు ఆయన అభిమానులకు పండగే. థియేటర్లన్నీ రెండ్రోజుల ముందు నుంచే సందడిగా కనిపిస్తాయి. తాజాగా, మహేశ్​ నటిస్తోన్న సినిమా సర్కారు వారి పాట. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా పరశురామ్​ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా కనిపించనుంది. తొలిసారి మహేశ్​కో కలిసి ఈ మహానటి స్క్రీన్​ షేర్​ చేసుకోనుంది.

Sarkaru vari pata

బ్యాంకింగ్​ సెక్టార్​లో జరిగే కుంభకోణం నేపథ్యంలో తండ్రిని కాపాడుకునే కొడుగ్గా మహేశ్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు ఇటీవల మహేశ్​ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సర్కారు వారి పాట టీజర్​ సినిమాపై ఎక్స్​పెక్​టేషన్స్​ను వేరే లెవెల్​లో పెట్టింది. ఈ సినిమాలో మహేశ్​ కొత్త లుక్​తో స్టైలిష్​గా కనిపించనున్నారు.

https://youtu.be/2cVu7KZxW3c

మరోవైపు సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని మొదట భావించారు. విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఏప్రిల్​1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ న్యూస్​ పిల్మ్​ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్​ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ కంపెనీ ఈ సినిమా హక్కులను సుమారు 15 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.