AP Ticket Prices: టికెట్స్ ధరలు తగ్గింపు పై హీరోల స్పందన ఏది ?

AP Ticket Prices: నిన్న బంగార్రాజు మూవీ ప్రమోషనల్ ఈవెంట్ సాక్షిగా నాగార్జున చేసిన కామెంట్, టికెట్స్ ధరల వివాదం సినారియో మొత్తం మార్చివేసింది. టికెట్స్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమలో అందరూ అసంతృప్తిగా లేరని తేలిపోయింది. ఇది కేవలం బడా నిర్మాతల సమస్యగానే మిగతా పరిశ్రమ భావిస్తుందని స్పష్టత వచ్చింది. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడని చాలా మంది ప్రముఖులు సైలెంట్ గా ఉన్నారని భావిస్తున్న తరుణంలో అది నిజం కాదని […]

Written By: Shiva, Updated On : January 6, 2022 1:03 pm
Follow us on

AP Ticket Prices: నిన్న బంగార్రాజు మూవీ ప్రమోషనల్ ఈవెంట్ సాక్షిగా నాగార్జున చేసిన కామెంట్, టికెట్స్ ధరల వివాదం సినారియో మొత్తం మార్చివేసింది. టికెట్స్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమలో అందరూ అసంతృప్తిగా లేరని తేలిపోయింది. ఇది కేవలం బడా నిర్మాతల సమస్యగానే మిగతా పరిశ్రమ భావిస్తుందని స్పష్టత వచ్చింది. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడని చాలా మంది ప్రముఖులు సైలెంట్ గా ఉన్నారని భావిస్తున్న తరుణంలో అది నిజం కాదని అర్థమవుతుంది.

AP Ticket Prices

వాస్తవంలో కూడా టికెట్స్ ధరలు తగ్గింపు వలన ఇబ్బంది భారీ బడ్జెట్ చిత్రాలకే. ఒకప్పటిలా హిట్ సినిమా వందల రోజులు థియేటర్స్ లో ప్రదర్శించే పరిస్థితి లేదు. వారం రోజుల్లో సినిమా పెట్టుబడి మొత్తం రాబట్టేయాలి. సినిమా సక్సెస్, లాభాలు ఓపెనింగ్స్ మీదే ఆధారపడి ఉంటాయి. దీంతో స్టార్ హీరోల సినిమా టికెట్స్ రెండు, మూడు రెట్లు అధిక ధరలకు మొదటి వారం అధికారికంగానే థియేటర్స్ లో విక్రయించేవారు. తమ హీరో టికెట్ ధర ఎంత ఎక్కువ పలికితే అంత గొప్పగా భావించే ఫ్యాన్స్ దాన్ని వాళ్ళు నష్టంగా భావించరు. అధిక ధరకు టికెట్ కొని సినిమా చూసేది దాదాపు అభిమానులే అని చెప్పాలి. కాబట్టి సామాన్యులు దీన్ని ఓ సమస్యగా ఎప్పుడూ తీసుకోలేదు.

ఇక స్టార్ హీరోతో మూవీ చేసే అవకాశం వచ్చిందంటే చాలు.. ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాతలకు కొన్ని కోట్లు లాభం వచ్చి చేరుతుంది. పెట్టుబడికి లాభం జోడించి బయ్యర్లకు సినిమా అమ్మేస్తారు. సినిమా బాగా ఆడితే మరిన్ని లాభాలు, లేదంటే తక్కువ లాభాలు. ఎటూ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మరికొంత వస్తుంది. కాబట్టి పెద్ద హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలు దివాళా తీసే రోజులు ఇప్పుడు లేవు.

Also Read: నాకు నచ్చలేదు జగన్ దిగిపోతావా? దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ

ఇక చిన్న చిత్రాల నిర్మాతలు ఎప్పటి నుండో బడా నిర్మాతల దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారు. చిన్న సినిమాలకు అసలు థియేటర్స్ దొరకవు, దొరికినా సినిమా ఎప్పుడు తీసేస్తారో తెలియదు. చివరకు ఓ డబ్బింగ్ మూవీ కోసం బాగా ఆడుతున్న చిన్న సినిమాను థియేటర్ నుండి తీసేస్తారు. చిన్న చిత్రాల నిర్మాతలు ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో టికెట్స్ ధరల తగ్గింపు తమ సమస్యగా పరిశ్రమలో ఓ వర్గం భావించడం లేదు. ఈ వివాదంలో తలదూర్చకుండా చూస్తూ కుర్చుంటున్నారు. ఎదుకంటే పరిశ్రమ పోరాటం ఫలించి టికెట్స్ ధరలు పెరిగినా, ఒక వేళ అదే ధరలు అమలైనా తమకు వచ్చిన లాభం కానీ నష్టం ఏమీ లేదు. మూడు నెలలుగా నడుస్తున్న టికెట్స్ వివాదంపై కొందరు మాత్రమే నోరుమెదుపుతున్నారు. ఇక నాగార్జున వంటి సీనియర్ హీరో చేసిన కామెంట్ తో టికెట్స్ ధరల తగ్గింపుపై పరిశ్రమలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయని తెలియజేసింది.

Also Read: జగనూ అలా చేస్తే నిర్మాతలకు డబ్బు మీకు ఓట్లు వస్తాయి !

Tags