https://oktelugu.com/

RTC Charges: ప్రయాణికులకు షాక్: ఆర్టీసీ చార్జీలు మోత మోగిపోయాయి.. ఎంత పెంచారంటే?

RTC Charges: అసలే కరోనా కల్లోలం.. పైగా ఆర్థిక కల్లోలం. ఈ క్రమంలోనే పైసల కోసం సామాన్యులు, సంస్థలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఆర్టీసీలు అయితే కుదేలయ్యాయి. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. దీంతో ఈ భారాన్ని భరించలేని సంస్థలు తాజాగా చార్జీలు పెంచడానికి రెడీ అయ్యాయి. తాజాగా తెలంగాణ ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. పల్లెవెలుగు నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2021 10:39 am
    Follow us on

    RTC Charges: అసలే కరోనా కల్లోలం.. పైగా ఆర్థిక కల్లోలం. ఈ క్రమంలోనే పైసల కోసం సామాన్యులు, సంస్థలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఆర్టీసీలు అయితే కుదేలయ్యాయి. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. దీంతో ఈ భారాన్ని భరించలేని సంస్థలు తాజాగా చార్జీలు పెంచడానికి రెడీ అయ్యాయి.

    RTC Charges

    TSRTC_8864

    తాజాగా తెలంగాణ ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. పల్లెవెలుగు నుంచి మిగతా అన్ని సర్వీసులకు చార్జీలు పెంచుతూ మోతమోగించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేశారు.

    పల్లెవెలుగుకు కిలోమీటర్ కు రూ.25 పైసలు, మిగతా సర్వీసులకు కిలోమీటర్ కు రూ.30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలను అధికారులు, మంత్రి పువ్వాడ కలిసి పంపించారు.

    Also Read: తప్పెవరిది? వరదసాయం కేంద్రం ముందే ఇచ్చిందట..! జగన్ సర్కార్ ఈ నిధులు ఏం చేసింది..?

    బస్సు చార్జీలు పెరిగితే ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయి. గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4260 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడింది.

    ఆర్టీసీ ఆదాయం 2455 కోట్లు ఉంటే.. ఖర్చు ఏకంగా 4784 కోట్లుగా ఉంది. ఏకంగా 2329 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడు చార్జీలు పెంచితే ఆర్టీసీ ఏడాదికి రూ.850 కోట్ల మేరకు ఆదాయం సమకూరి కాస్త కుదుట పడుతుంది.

    Also Read: పోలీసులకు సీఎం జగన్ ఇచ్చిన ఆఫర్ ఉత్తిదేనా?