‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో రాజమౌళి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో మల్టీ స్టారర్ సినిమాల హవా భారీ రేంజ్ లోకి పెరిగిపోయింది. ఇక ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు రజనీకాంత్ కాంబోలో కూడా రావాల్సిన ఒక సినిమా మిస్ అయిపోయిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయనతో సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి వెయ్యి కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుంది అంటూ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి తొందర్లోనే మహేష్ బాబుకు సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా రాజమౌళి చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కాంబినేషన్ లో రావాల్సిన ఒక సినిమా కార్య రూపం దాల్చలేదనే విషయం మనలో చాలామందికి తెలియదు.
నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ (NTR) హీరో గా వచ్చిన జనతా గ్యారేజ్ (Janatha Garage) సినిమాని మొదట మహేష్ బాబు(Mahesh Babu) తో తెరకెక్కించాలని అనుకున్నారట. ఇక అందులో హీరోగా మహేష్ బాబు నటిస్తే మోహన్ లాల్ చేసిన క్యారెక్టర్ ను రజనీకాంత్(Rajini Kanth) చేత నటింపజేయాలని కొరటాల శివ (Koratala Shiva) భావించారట. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
మహేష్ బాబు ఆ కథని రిజక్ట్ చేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. దాంతో కొరటాల శివ ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ మోహన్ లాల్ ను పెట్టి తెరకెక్కించాడు. దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇలా మహేష్ బాబు రజనీకాంత్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా మిస్ అయిందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా కొరటాల శివ మహేష్ కాంబోలో వచ్చిన ‘శ్రీ మంతుడు ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తోనే వీళ్ళ కాంబినేషన్ లో ‘భరత్ అను నేను’ సినిమా కూడా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించడం విశేషం… మరి జనతా గ్యారేజ్ స్టోరీని మహేష్ బాబు ఎందుకని రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా తనకి సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో పక్కన పెట్టేసాడా? లేదంటే తను బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను చేయలేకపోయాడా? అనేది తెలియదు. ఇక మొత్తానికైతే మహేష్ బాబు ఒక సూపర్ హిట్ సినిమాని మిస్ అయిపోయాడనే చెప్పాలి…