https://oktelugu.com/

KCR plan in national politics : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఎలా ముందుకెళతారు?

KCR plan in national politics : కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రధాని పదవిపై కన్నేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఇప్పుడు అదే ఊపులో ‘దేశ్ కీ నేత’ అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధితో తన మార్క్ చూపించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. మరి అక్కడ ఆయన విజయం సాధిస్తారా? అసలు ప్లాన్ ఏంటి? అన్నది హాట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2022 / 11:06 AM IST
    Follow us on

    KCR plan in national politics : కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రధాని పదవిపై కన్నేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఇప్పుడు అదే ఊపులో ‘దేశ్ కీ నేత’ అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధితో తన మార్క్ చూపించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. మరి అక్కడ ఆయన విజయం సాధిస్తారా? అసలు ప్లాన్ ఏంటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

    కేసీఆర్ ఇక జాతీయ నేత కాబోతున్నారు. వచ్చేవారమే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారు. ఢిల్లీలోనే కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేయబోతున్నారు. ఇక అక్కడే జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కనీసం సగం రాష్ట్రాలకు అయినా ఇన్ చార్జీలను ప్రకటించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది..

    అయితే ప్రధాన సమస్యల్లా ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మార్చుకొని నిలకడలేని రాజకీయం చేసే కేసీఆర్ తో ఎవరు వస్తారన్నది కీలకంగా మారింది. కేసీఆర్ వెంట జాతీయ రాజకీయాల్లో వచ్చే వారు ఎవరన్నది మాత్రం స్పష్టం కావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి తెలంగాణలో కేసీఆర్ అధికారం కొల్లగొట్టారు. ఓపక్క బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీకి సపోర్ట్ చేశారు. ఇలా కేసీఆర్ ట్రాక్ రికార్డ్ జాతీయ రాజకీయాల్లో అనుమానాస్పదంగానే ఉంది. అందుకే కేసీఆర్ ను నమ్మి రావడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

    కేసీఆర్ దేశ్ కీ నేత అని దాదాపుగా అన్నీ రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. మీడియాకు కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు వెళ్లి మరీ సమావేశాలు నిర్వహించారు. అంతర్గతంగా ఎన్నో కీలక సమావేశాలు నిర్వహించి ఆయా రాష్ట్రాల నేతలతో సమావేశం అవుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభావం చూపగల.. ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని వారిని గుర్తించి బీజేపీకి వ్యతిరేకంగా వాదన వినిపించగలిగే వాళ్లను రెడీ చేసుకుంటు్నారు. వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లేకున్నా.. ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు ఉంటుందని.. బీఆర్ఎస్ ను వారు ప్రజల్లోకి తీసుకెళ్లగలరని భావిస్తున్నారు. అందుకే ప్రతీరాష్ట్రంలోనూ బీఆర్ఎస్ కు అనుబంధంగా నేతలను సృష్టించి ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.

    ఇక కేసీఆర్ టీంలో ఉండవల్లి, ప్రకాష్ రాజ్, హీరో విజయ్ లు ఉంటారని అనుకున్నా వారు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉండవల్లి తాను రాజకీయాల్లో రిటైర్ అయ్యానని ప్రకటించేశారు. ఇక ప్రకాష్ రాజ్ ను కర్ణాటక ఇన్ చార్జిగా నియమించవచ్చు. తమిళనాడుకు స్టార్ హీరో విజయ్ ను పెట్టవచ్చని భావిస్తున్నారు. కానీ కేసీఆర్ పార్టీతో ఆయన రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేం. సొంతంగానే పార్టీ స్థాపించి ముందుకెళ్లవచ్చు.

    జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రధానిగా నిలబడాలంటే ముందుగా రాష్ట్రాల్లో బలమైన వ్యక్తులు కావాలి. అలాగే ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి. ఇలాంటివేవీ లేకుండా ఒంటరిగా వెళితే కేసీఆర్ నెగ్గుకురావడం కష్టమే. దేశవ్యాప్తంగా నేతలు, పార్టీలే కేసీఆర్ ను ముందుకు నడిపిస్తాయి. ఆ దిశగా మొదట బలంగా అడుగులు పడితే కేసీఆర్ ఆశించిన దేశ్ కీ నేత కావడం ఈజీనే. అది జరుగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.