Russia: నాటోను లెక్క చేయలేదు. అమెరికా ను ఖాతరు చేయలేదు. ఆంక్షలను లక్ష్య పెట్టలేదు. యుద్దం వద్దన్న యూఎన్వో ను పట్టించుకోలేదు. ఉక్రెయిన్ తో కదన రంగం లో రష్యా ముందుకే వెళ్ళింది. దూకుడుతో ఉక్రెయిన్ ను నేలమట్టం చేసింది. ఆమెరికా లాగా అగ్రరాజ్యం కాదు. చైనా లాగా ఆర్దిక సంపత్తి లేదు. కెనడా లాగా బలమైన వనరులు లేవు. మరి ఏంటీ రష్యా ధైర్యం? ఏ దేశాన్ని లెక్కచేయకుండా ఏంటి ఈ దుందుడుకుతనం? ఇంతకీ ఈ మాజీ సోవియట్ రష్యా బలం ఎక్కడ ఉంది? ఎందుకు మిగతా దేశాలు పుతిన్ నిర్ణయాలు చూసి భయపడుతున్నాయి?

…
యుద్దరంగంలో చీల్చి చెండాడుతుంది
…
గతంలో రాజుల కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు శత్రువులను తుత్తునీయలు చేసేవారిని అరి వీర భయంకరులుగా అభివర్ణించేవారు. సరిగా అలాంటి కోవకు చెందినదే రష్యా అణు జలాంతర్గామి. దాని పేరు k329 బెల్గరోడ్. అత్యంత పొడవుతో పాటు సముద్ర గర్భంలోని అట్టడుగున కూడా దాక్కోగలదు. శాస్త్రీయ పరిశోధనలు, అత్యంత లోతైన ప్రదేశాల్లో సహాయక చర్యలకు ఉపయోగపడగలదు. అన్నింటికీ మించి సముద్రంలో ఎగిసే అలలను ఆయుధాలుగా మలుచుకుని ఏకంగా సునామీనే సృష్టించగలదు. శత్రు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, లక్షిత ప్రాంతాలను సర్వ నాశనం చేయగలదు. ఇదే ఇప్పుడు రష్యా ప్రధాన బలం. అత్యంత ఆధునిక బలగం కూడా. అసలు బెల్గరోడే అత్యంత వినాశకర జలాంతర్గామి అనుకుంటే.. దీనికి మరో చిన్న అణు శక్తి జలాంతర్గమి కూడా ఉంటుంది.
…
నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంతే
…
ఉక్రెయిన్ పై రష్యా హోరాహోరీగా పోరాడుతోంది. పది రోజుల క్రితం ఎంతో కీలకమైన స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో తోక ముడిచిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను అత్యంత ఆశ్చర్యపరిచేలా అతిపెద్ద జలాంతర్గామి బెల్గరోడ్ ను తాము తయారు చేసి సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టామని రష్యా ప్రకటించింది. అదే కాదు దీనిని వాయువ్య ప్రాంతాల్లోని అత్యంత వ్యూహాత్మకమైన కోలా దీపకల్పంలోని సెవె రోడిన్స్క్ లో జలాల్లోకి ప్రవేశపెట్టామని వెల్లడించింది. ఫిన్లాండ్, స్వీడన్ సమీపంలోని తెల్ల సముద్రంలో కోలా ఉంటుంది. ఇక ఈ రెండు దేశాలు నాటో కూటమి లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రష్యా ఈ ఆణు ప్రయత్నం.
…
అంతకు మించి
…
బెల్గరోడ్ పొడవు 604 అడుగులు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల జలాంతర్గముల కన్నా ఇదే అత్యంత పొడవైనది. వాస్తవానికి గతంలోనే రష్యా ఆస్కార్ -2 శ్రేణికి చెందిన జలాంతర్గములను రూపొందించింది. ఇందులో కొన్ని లోపాలు ఉండటంతో జలాంతర్గామి పొడవును మరో 100 అడుగులకు పెంచి బెల్గోరోడ్ ను అణు టార్పెడో పొసైడాన్ ను ప్రయోగించేలా ఏర్పాటు చేసింది. కేవలం అణు పొసైడాన్లే కాకుండా కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే 79 అడుగుల పొడవైన ఎనిమిది పొసైడాన్ అణు టార్పెడోలు ఉంటాయి. ఇవి గంటకు 70 నుంచి 125 నాట్స్ వేగంతో పనిచేస్తూ ఉంటాయి. ఇక ఈ ఆయుధాన్ని రష్యా ప్రతిదాడికి మాత్రమే వినియోగిస్తుంది. పొసైడాన్ ను లోని లక్ష్యాలపై దాడికి ఉపయోగిస్తుంది. ఇవి లక్ష్యాల సమీపంలోకి వెళ్లి అణు పేలుడు జరుపుతాయి.
…
సునామీ ఇలా ఏర్పడుతుంది
…
అణు పేలుళ్లకు కనీసం రెండు టన్నుల కోబాల్ట్ వార్ హెడ్ అమర్చినా కిలోమీటర్ల మేర సముద్రపు నీరు కలుషితం అవుతుంది. వార్ హెడ్ లో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉండటం వల్ల భారీ నీటి అలలు సునామీలా లక్ష్యాలపై విరుచుకుపడతాయి. అంతేకాకుండా తీర ప్రాంతంలోని రద్దీగా ఉండే నగరాలు, ప్రాంతాలు, క్యారియర్ బ్యాటిల్ గ్రూపులను టార్గెట్ గా చేసుకొనే అవకాశం ఉంటుంది. రష్యా ప్రపంచ శక్తిగా అవతరించేందుకు తహతలాడుతున్న నేపథ్యంలో శతృదేశాలకు హెచ్చరిక పంపేందుకు గత ఏడాది రహస్యంగా మొదటిసారి బెల్గరోడ్ ను నల్ల సముద్రంలోకి ప్రవేశపెట్టింది. ఇక రష్యా అధికారిక వర్గాల ప్రకారం బెల్గరోడ్ జనవరిలోనే సముద్రంలో పరీక్షలు పూర్తి చేసుకుంది. ముందుగా నిర్దేశించిన గడువు ప్రకారం ఈ నెల 31న దీనిని నౌక దళానికి. అందజేయాల్సి ఉంది. కానీ 20 రోజుల ముందే అప్పగించారు.
Also Read: Water Side Effects: మంచినీరు ఎక్కువగా తాగినా నష్టాలేనా? ఏంటవి?
…
ఎన్నో విధ్వంసక చర్యలు
..
ఇప్పుడు ప్రపంచమంతా ఆర చేతిలో ఇమిడిపోతోంది. ఇంటర్నెట్ లేకుంటే ప్రపంచమంతా స్తంభించిపోతుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగాలంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్సే ఆధారం. అయితే ఈ బెల్గరోడ్ తో కేబుల్స్ ను ధ్వంసం చేయొచ్చు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న ఈ జలాంతర్గామితో పశ్చిమ దేశాల సమాచార వ్యవస్థను కుప్పకూల్చవచ్చు. సమాచార చోర్యం, కోవర్టు ఆపరేషన్లకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పైనే ఇంటర్నెట్ ట్రాఫిక్ ఆధారపడి ఉంది. వేల రష్యా కనుక ఈ కేబుళ్ళను ధ్వంసం చేస్తే ప్రపంచం మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది.
…
రష్యా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది
…
సోవియట్ రష్యా ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించేది. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన తర్వాత రష్యా తన గత ప్రాభవాన్ని కోల్పోయింది. పుతిన్ అధ్యక్షుడైన తర్వాత రష్యా మళ్లీ పుంజుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తన ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ లాంటి దేశాలకు చమురు విక్రయిస్తోంది. అది కూడా కన్జ్యూమర్ దేశాల కరెన్సీ లోనే చెల్లింపులు జరుపుతోంది. దీనివల్ల ఆయా దేశాలు డాలర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఫలితంగా రష్యా చమురుకు గతంలో ఎన్నడు లేనివిధంగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కొత్త కొత్త బావులను కూడా రష్యా తెరపైకి తీసుకువచ్చింది. దీనివల్ల రష్యా విదేశీ మరక ద్రవ్య నిలువలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఫారెక్స్ నిల్వలు ఉన్న దేశంగా రష్యా అవతరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్నప్పటికీ రష్యా ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులకు లోను కాకుండా స్థిరంగా నిలబడుతోంది. పైగా గతంలో ఎన్నడూ లేనంత విధంగా రక్షణ రంగంలో అత్యధిక ఆయుధాలను కనిపెడుతోంది. వీటిని భారత్ వంటి వర్ధమాన దేశాలకు విక్రయిస్తోంది. ప్రస్తుతం అమెరికా వృద్ధిరేటు పడి పోవడం, చైనాలో చెల్లింపుల సంక్షోభం ఏర్పడటంతో గతంలో తన పెద్దన్న స్థానాన్ని తిరిగి సాధించేందుకు రష్యా తహతహలాడుతోంది. అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతోంది.
Also Read: Pawan Kalyan Politics: బీజేపీనా..? టీడీపీనా.? ఏ పార్టీవైపు పవన్ మొగ్గు..?
[…] […]