Srisailam: దేశంలో మత విద్వేషాలు పెరుగుతున్నాయి. ఇటీవల జార్ఖండ్ లో ఓ మతానికి చెందిన యువకుడిని బీజేపీ నేతలు చిత్రహింసలు పెట్టిన సంగతి విధితమే. శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఓ వర్గంపై దాడులు కొనసాగుతన్నాయి. ఆలయంలో వారి ఆధిపత్యమే ఉండటంపై బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మకూరులో ప్రైవేటు స్థలంలో ఓ మతం వారు దేవాలయం కట్టుకుంటుంటే మరో వర్గం అడ్డుకుంది. దీంతో వారు కోపోద్రిక్తులై వారిపై దాడి చేసేందుకు ఉద్యుక్తులయ్యారు.

మత విద్వేషాలను రెచ్చగొడితే ఊరుకునేది లేదని డీజీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే గతంలో పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన సంఘటనలు కూడా ఉండటంతో ప్రజల్లో భయం పోగొట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
ఇదివరకు కూడా ఏపీలో ఇలాంటి సంఘటనలు జరిగినా కనీసం కేసులు కూడా పెట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో రాజకీయాల కోసం పేదల బతుకుల్ని పణంగా పెడుతున్నారనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం అందరిని సమస్యల్లోకి నెట్టడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: KCR Politics: టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చే స్కెచ్ వేసిన కేసీఆర్?
రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో పోలీసులు ఉన్నంత కాలం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఎవరి కోసమో ఎవరో త్యాగాలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మత విద్వేషాల పట్ల అందరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. దీనికి రాజకీయాలను ముడిపెడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుకోవద్దు.
Also Read: Lovers: తనకంటే చిన్నోడిని ప్రేమించిన అమ్మాయి.. చివరికి ఇలా చేసింది?