Homeజాతీయ వార్తలుDraupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికలో బీజేపీ వ్యూహమేంటి?

Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికలో బీజేపీ వ్యూహమేంటి?

Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అధికార పార్టీ బీజేపీ తమ అభ్యర్థిగా ఓ గిరిజన మహిళను ఎంచుకుంది. ప్రతిపక్షాలు సైతం తమ అభ్యర్థి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రహసనం పార్టీలకు ఓ సవాలుగా మారింది. ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని బీజేపీ భావిస్తుంటే తాము సైతం గట్టి పోటీ ఇవ్వడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల తంతు ఆసక్తికరంగా మారనుంది.

Draupadi Murmu
Draupadi Murmu

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో రకరకాల ప్రచారాలు సాగినా చివరకు మాత్రం బీజేపీ ఓ సాహసమైన నిర్ణయమే తీసుకుంది. త్వరలో జరగబోయే ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గిరిజన ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశంతో ద్రౌపది ముర్మును తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో రాజకీయాల్లో చర్చ మొదలైంది. ద్రౌపది ముర్ము వ్యక్తిగత విషయాలపై నెట్టింట్లో వెతుకులాట ప్రారంభమైంది. అసలు ఎవరీమె? ఏం చేస్తుంది? ఈమెకు ఈ అవకాశం ఎలా వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Also Read: Pawan kalyan Next CM of AP: నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్.. ముందే చెప్పిన బ్రహ్మంగారు… నెట్టింట వైరల్

పేదరికంలో పుట్టిన ద్రౌపది ముర్ము కాబోయే రాష్ట్రపతి అభ్యర్థి కావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. కనీస రాజకీయ అనుభవం లేని ద్రౌపది ముర్ము కౌన్సిలర్ నుంచి రాష్ర్టపతి అభ్యర్థి కావడంతో అందరిలో సందేహాలు వస్తున్నాయి. బీజేపీ తన అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. రాబోయే 2024 ఎన్నికల్లో గిరిజన ఓట్లు రాబట్టుకునే క్రమంలోనే ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలకు సైతం మింగుడుపడటం లేదు.

Draupadi Murmu
Draupadi Murmu, modi

ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదని తెలుస్తోంది. ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఎన్నో కష్టాలు భరించింది. వ్యయప్రయాసలు అనుభవించి జీవితంలో నిలదొక్కుకుంది. కౌన్సిలర్ నుంచి రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. బీజేపీ వ్యూహాత్మకమైన ఆలోచనతోనే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా చేయడంలో సఫలత సాధించినట్లు భావిస్తున్నారు. ప్రతిపక్షాలకు సైతం షాక్ ఇచ్చే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానంగా చర్చ సాగుతోంది. ఏదిఏమైనా ద్రౌపది ముర్ము జీవితం మాత్రం మారిపోనుందని తెలుస్తోంది.

Also Read:Manchu Lakshmi Yoga: నీకు అవసరమా బామ్మా అంటూ మంచు లక్ష్మిని ఆడేసుకున్నారు… ఇంతకీ ఆమె ఏం చేశారంటే!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version