Komaram Bheemudo Making Video: 2022 ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆర్ ఆర్ ఆర్ మూవీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ వరల్డ్ వైడ్ రూ. 1118 కోట్ల గ్రాస్ రాబట్టింది. అమెరికాలో జూన్ 1న రీరిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది. ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ముగ్దులవుతున్నారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. యూఎస్ ఆడియన్స్, ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ ఆర్ ఆర్ అద్భుతంగా ఉందంటూ కొనియాడడం విశేషం.
దర్శకుడు రాజమౌళి మేకింగ్ లో మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ప్రేక్షకులను మైమపరిపించే విజువల్స్ అనేకం ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రో సీన్స్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ రాజమౌళి గొప్పగా తీర్చిదిద్దారు. ఇక ఆర్ ఆర్ ఆర్ లో చెప్పుకోదగ్గ సన్నివేశాల్లో కొమురం భీముడో సాంగ్ ఒకటి. బ్రిటీష్ కోటపై దాడి చేసి దొరికిపోయిన భీమ్ ని బహిరంగంగా శిక్షిస్తారు. ఆ శిక్ష స్వయంగా రామ్ చేత అమలు చేయిస్తారు. రామ్ భీమ్ ని కొరడాతో కొడుతూ ఒళ్ళు చీలేస్తాడు.
ఆర్ ఆర్ ఆర్ లోని కొమరం భీముడో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనతో పాటు ఆ పాట చిత్రీకరణ కూడాను. కాగా ఈ సీన్ విజువల్ గా వెండితెరపై ప్రెజెంట్ చేయడంలో రాజమౌళి ఎంత మాయ చేశాడో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. భీమ్ కి శిక్ష విధించే నాలుగు రోడ్ల కూడలి నిండా జనం ఉంటారు. ఆ దారులు జనాలతో కిక్కిరిసిపోయి ఉంటాయి. నిజానికి అక్కడ అంత మంది జనం లేరు. కేవలం ఫ్రంట్ లో ఓ 50-60 మంది జూనియర్ ఆర్టిస్ట్ ని ఉపయోగించారు. మిగతా కనిపించే జనాలు మొత్తం గ్రాఫిక్స్ లో చేసిందే.
కొమరం భీముడో సాంగ్ మేకింగ్ వీడియో బయటికి రాగా ఈ విషయం బయటపడింది. దీంతో రాజమౌళి టెక్నీక్, గ్రాఫిక్స్ మాయాజాలానికి ప్రేక్షకులు ఔరా అంటున్నారు . ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియోలు టీమ్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో అసలు విషయాలు బయటపడుతున్నాయి. నిర్మాత డివివి దానయ్య రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్, సముద్ర ఖని, శ్రియా కీలక రోల్స్ చేశారు. కీరవాణి సంగీతం అందించారు.