MP Gorantla Madhav-TDP: ఏపీని ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదం వదలడం లేదు. రోజురోజుకు రచ్చరచ్చగా మారుతోంది. ఇప్పటికే వీడియో ఫేక్ అని ఏపీ పోలీసులు తేల్చేశారు. టీడీపీ మాత్రం అమెరికా ఫోరెనిక్స్ ల్యాబ్ లో పరిశీలన చేశామని..ఆ వీడియోలో ఉన్నది మాధవ్ అని తేలిందని చెబుతోంది. ఇది మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే వైసీపీ మాత్రం కౌంటర్ ఎటాక్ ఇస్తోంది. ఎంపీ మాధవ్ ఇమేజ్ డ్యామేజీ అయ్యిందని భావించి.. దానిని పూడ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆదివారం సొంత జిల్లా అనంతపురానికి మాధవ్ వచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా బళ్లారి చౌరస్తా వద్ద ఆలయంలో ఎంపీ మాధవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి భారీ కాన్వాయ్ తో ఆయన అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళ్లారు.

వైసీపీ ఎదురు దాడి
అయితే ఇప్పుడు ఆ వీడియో ఒరిజినల్ అని టీడీపీ చెబుతుండడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. వైసీపీ నేతలు ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ఓ ఎంపీ ప్రైవేటు వ్యవహారాన్ని టీడీపీ రచ్చ చేయడం దారుణమని వైసీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా స్పందించారు. తన వీడియోను పోలీసులు ఫేక్ అని తేల్చారని.. అటువంటప్పుడు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తగునా అని ప్రశ్నించారు. ఆ వీడియో ఒరిజినల్ అని.. ఫేక్ కాదని అమెరికా ఫొరెనిక్స్ ల్యాబ్ తేల్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.తనపై తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే టీడీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. టీడీపీ నేతలే ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసులుగా మాట్లాడుతున్నారని..న్యాయమూర్తులు, సైంటిస్టుల మాదిరిగా పరీక్షలు, ప్రయోగాలు,తీర్పులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలని హితవుపలికారు.
Also Read: Pawan Kalyan: రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు?
తెరపైకి ఓటుకు నోటు..
టీడీపీ నేతలు ఫోరెనిక్స్ ల్యాబ్ విషయం బయటకు తేవడంతో ఎంపీ మాధవ్ చంద్రబాబు ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చారు. నాడు ఆడియో టేపులో చంద్రబాబు గొంతును కాదని చెప్పారని.. ఆయన కానీ ఆ ఆడియోను ఫోరెనిక్స్ ల్యాబ్ కు అందిస్తే.. తన వీడియో కూడా ఇచ్చి నిజానిజాలు తేల్చుకుందామని సవాల్ విసిరారు. నాడు ఓటుకు నోటు కేసులో నామినేటెట్ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు ఆ ఆడియో టేపులో వినిపించిన గొంతు చంద్రబాబుది కాదని టీడీపీ నేతలు రచ్చచేశారని.. అయితే ఈ ఆడియో టేపులో వినిపించిన గొంతు చంద్రబాబుదేనని ఆరోపించారు. ఆ ఆడియోతో పాటు తనదిగా భావిస్తున్న వీడియోను ల్యాబ్ కు పంపించి శల్య పరీక్ష జరిపించుకుందామని కూడా సవాల్ చేశారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.

అంతటా విస్మయం..
అయితే ఎంపీ మాధవ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై రాజకీయ పక్షాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణ వచ్చి ఇంతగా వివాదం తలెత్తినప్పుడు కూడా అత్యున్నత విచారణ సంస్థలతో పని లేకుండా పోలీస్ అధికారులతో ప్రకటనలు ఇప్పించడం ఏమిటన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. దీనికితోడు ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతుండడం కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యున్నత లోక్ సభ సభ్యుడిపై ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ప్రభుత్వం స్పందించిన తీరును రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుపడుతున్నారు. ఈ విషయంలో పారదర్శకత నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎంపీ మాధవ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
Also Read:CM Jagan- AP Govt Employees: ఏపీ ఉద్యోగులను కూల్ చేస్తున్న జగన్.. అసలు కారణమేంటి?
[…] […]