Karthikeya 2 Theaters Issue: అంతటి మెగాస్టార్ సమర్పించినా, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించినా లాల్ సింగ్ చద్ధా పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. బ్బాబ్బాబు నా సినిమా చూడండి అని అమీర్ ఖాన్ బతిమిలాడుతున్నాడు. అయినప్పటికీ ప్రేక్షకులు #బ్యాన్ లాల్ సింగ్ చద్దా ను ట్రోల్ చేయడం ఆపట్లేదు. ఒక్కసారి జనానికి ఏవగింపు కలిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా ఫలితం చాలా మంది సినీ పెద్దలు అలియాస్ గద్దలకు ఓ గుణపాఠం. ఇలాంటి గతే తెలుగు సినిమాను శాసిస్తున్న ఆ నలుగురిలో ఒకడయిన ఆ నిర్మాతకు పడుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. తెలుగు సినిమా పరిశ్రమ ఆ నలుగురు చేతిలో బంధీ అయింది. వారు ఏం చెబితే అదే జరుగుతోంది.

ఇంతకీ ఎందుకు అడ్డుకున్నారు?
తెలుగు సినిమా వారి చేతుల్లో ఉంది. ముఖ్యంగా దిల్ రాజు అనే నిర్మాత సిండికేట్ రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. తాము అనుకున్న సినిమాలే రిలీజ్ కావాలి. వారు చెప్పినవే ఆడాలి. ఎవరైనా కాదు కూడదు అంటే సవాలక్ష సినిమాల్లాగే అవి కూడా ప్రసాద్ ల్యాబ్ లో దుమ్ము పట్టి, బూజు కొట్టి పోవాలి. ఒకవేళ విడుదల చేస్తే థియేటర్లు దొరకనీయరు. దాసరి నుంచి నట్టి కుమార్ దాకా ఎంతో మంది మొత్తుకున్నా ఇది మారదు. ఈ దరిద్రం ఎప్పటి నుంచో ఉన్నదే. అయినప్పటికీ తాజాగా నిఖిల్ సిద్దార్థ కార్తీకేయ_2 విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఇదే విస్తృతంగా చర్చలో ఉంది. అసలు కార్తీకేయ సినిమాకు దిల్ రాజు అడుగడుగునా అడ్డు పడ్డాడు. మొదట సినిమా జూన్ లో విడుదల చేస్తాం అనుకున్నారు. దిల్ రాజు నిర్మించి, అక్కినేని నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ కోసం ఆపించాడు. ఫలితం భారీ డిజాస్టర్. ఆ తరువాత అయినా విడుదల చేద్దామనుకుంటే నితిన్ మాచర్ల నియోజకవర్గం కోసం మరోసారి పోస్ట్ పోన్ చేశారు. దీని వెనుక ఉన్నది కూడా సదరు దిల్ రాజే. గాలికి పోయిన పేల పిండి లాంటి ఈ సినిమాలను బలంగా రుద్దాలని దిల్ రాజు చూసినా జనం యాక్ థూ అని కాండ్రించి ఉమ్మారు.
Also Read: Sita Ramam Collections:’సీతా రామం’ 10th డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
కొన్ని చోట్ల విడుదలే కాలేదు
కార్తీకేయ _2 మంచి విజయాన్ని సాధించింది. బింబిసార, సీతారామం తర్వాత మరో విజయాన్ని పరిశ్రమకు ఇచ్చింది. తెలుగు తో పాటు హిందీలో నూ అమీర్ ఖాన్ సినిమాకు మించి కలెక్షన్లు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో ఇక విడుదలే కాలేదు. హీరో నిఖిల్ చేసిన ట్వీటే ఇందుకు నిదర్శనం. ఒక స్థాయి హీరో నిఖిల్ పరిస్థితే ఇలా ఉంటే ఇక వర్థమాన హీరోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

పేరుకే నీతులు
దిల్ రాజు లాంటి వాళ్ళు బయటకు బొచ్చెడు నీతులు చెబుతారు. కానీ ఫీల్డ్ రియాల్టీ లో మాత్రం ఉత్తి హంబగ్. సినిమాల షూటింగ్ లు బంద్ చేస్తా మంటారు. థియేటర్ల ఉద్దరణకు ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతుంటారు. కానీ ఊదు కాలదు. పీరి లేవదు. అసలు థియేటర్ల మాఫియాకు కారణం ఎవరు? టికెట్ నుంచి పార్కింగ్ దాకా అన్నింటా దోపిడీ. అసలు ప్రేక్షకుడు థియేటర్ దాకా వచ్చేందుకు జంకే పరిస్థితి తెచ్చింది ఈ మాఫియానే కదా! ఈ టెంపో కొన్ని సార్లు కొనసాగితే చాలా బాగుండు. కానీ ఇలాంటి నిర్మాతలకు మళ్లీ బింబిసార, సీతారామం వంటి సినిమాలు ఊపిరి పోస్తున్నాయి. అసలు కార్తీకేయ కు గనుక థియే టర్లు ఇస్తే వసూళ్లు ఓ రేంజ్ లో ఉండేవి. కానీ తన మాటే నెగ్గాలి అనుకునే దిల్ రాజు పైత్యం వల్ల సినిమా ఇబ్బందులను ఎదుర్కొన్నది. అయితే ఇలా ఎన్ని సినిమాలను తొక్కేయ గలరు? తెలుగు సినిమాకి ఎన్ని రోజులు ఈ దరిద్రం? ఒక దశ వరకే ఇవన్నీ. ఎదురు తన్నడం మొదలు పెడితే ఎంత పెద్ద పుడింగి లైనా చేసేది ఏమీ ఉండదు. థ్యాంక్యూ, మాచర్ల నియోజకవర్గం లాగా పేలి పోక తప్పదు. అన్నట్టు కార్తీకేయ కు నిర్మాత అభిషేక్ ఆగర్వాల్. ఇతను కూడా డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో ఉన్నవాడే. ఎషియన్ నారాయణ్ నారంగ్ అంతటి వాడే. కానీ అతడి సినిమాకి చుక్కలు చుపాడంటే దిల్ రాజు ఎంతటి అనకొండో?!