https://oktelugu.com/

Jagan- Debts: అప్పులను నియంత్రిస్తే జగన్ పరిస్థితి ఏమిటి?

Jagan- Debts: రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయో లేదో.. వైసీపీ సర్కారుకు కేంద్రం షాకులమీద షాకులిస్తోంది. రాజకీయపరమైన విధానాలతో కాకుండా ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్రజేస్తోంది. అయితే అప్పులకుప్పతో ఇబ్బందులు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది మింగుడు పడడం లేదు. ఇప్పటికే విపక్షాలు జగన్ పై ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీని శ్రీలంక మాదిరిగా దివాళా దిశగా తయారుచేస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి. ముప్పేట దాడి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి పవర్ పాయింట్ […]

Written By:
  • Dharma
  • , Updated On : July 27, 2022 / 09:11 AM IST
    Follow us on

    Jagan- Debts: రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయో లేదో.. వైసీపీ సర్కారుకు కేంద్రం షాకులమీద షాకులిస్తోంది. రాజకీయపరమైన విధానాలతో కాకుండా ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్రజేస్తోంది. అయితే అప్పులకుప్పతో ఇబ్బందులు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది మింగుడు పడడం లేదు. ఇప్పటికే విపక్షాలు జగన్ పై ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీని శ్రీలంక మాదిరిగా దివాళా దిశగా తయారుచేస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి. ముప్పేట దాడి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఏపీ ప్రభుత్వ విధానాన్ని గుర్తుచేసింది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులపై ఫోకస్ పెట్టింది. కఠిన ఆంక్షల దిశగా వెళుతోంది. గతంలోలాగా ఇష్టరాజ్యంగా అప్పులు తీసుకుంటామంటే కుదరని పనిగా సంకేతాలిస్తోంది. అయితే జరుగుతున్న పరిణామాలు వైసీపీ సర్కారుకు మింగుడు పడడం లేదు. అప్పులు దొరకకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని సీఎం జగన్ లో ఆందోళన వెంటాడుతోంది. అదే జరిగితే ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. అటు చేసిన అప్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇటు సంక్షేమ పథకాలు అందక ప్రజల నుంచి అసంతృప్తిలు మొదలవుతాయి. మొదటికే మోసం వస్తుందని జగన్ ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం ఉన్నపలంగా అడ్డం తిరగడంపై అయోమయానికి గురవుతున్నారు. కొన్నాళ్ల పాటు కేంద్రం ఎటువంటి షరతులు, అభ్యంతరాలు పెట్టకుంటే సవ్యంగా జరిగిపోయి ఉండేదని భావిస్తున్నారు.

    Jagan

    కత్తిమీద సామే…
    అయితే ఇన్నాళ్లూ ఒక ఎత్తు.. ఇక్కడ నుంచి ఒక ఎత్తు అన్నట్టు మారింది పరిస్థితి. ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని నడపాలంటే జగన్ కు కత్తిమీద సామే. అటు ఆదాయం తగ్గుముఖం పట్టడం, ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకు నిధులు సమీకరించుకోవడం శ్రమే. కానీ ఉన్నట్టుంది కేంద్ర ప్రభుత్వం అడ్డం తిరగడంపై మాత్రం జగన్ తెగ బాధపడిపోతున్నారు. జగన్ చేస్తున్న అప్పులు అక్రమమా? సక్రమమా? అన్నది అటుంచితే మాత్రం మూడేళ్లుగా కేంద్రం కూడా చూసీచూడనట్టుగా వ్యవహరించింది. కానీ పరిస్థితి చేయి దాటుతుండడంతో స్పందించక తప్పలేదు.

    Also Reade: Mohan Babu- Chandrababu: హాట్ టాపిక్: చంద్రబాబుతో మోహన్ బాబు భేటి.? కథేంటి?

    ఒక విధంగా చెప్పాలంటే ఏపీ విషయంలో సీరియస్ గా తీసుకున్నట్టు పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కారుకు బాగానే సహకరించింది. అప్పులకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చింది. ఏపీ సర్కారు కూడా మాజీ బ్యాంకు అధికారులను కమీషన్ ఏజెంట్లుగా పెట్టుకొని లాబీయింగ్ చేసింది. కానీ ఇప్పడు డామిట్ కథ అడ్డం తిరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా బ్యాంకులకు నోటీసులు పంపించందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నిబంధనలకు లోబడి మాత్రమే ఇకపై బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశముంది.

    Jagan

    నగదు బదిలీపై ప్రధాని గుస్సా..
    వాస్తవానికి దేశంలో 11 రాష్ట్రాలు స్థాయికి మించి అప్పలు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శ్రీలంక ఉదంతాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సున్నిత హెచ్చరికలు పంపింది. అటు ప్రధాని మోదీ కూడా ఉచిత పథకాలు అభివృద్ధి నిరోధకాలుగా అభివర్ణించారు. నగదు బదిలీ పథకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏపీ ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలతో ఆర్థిక క్రమ శిక్షణ కట్టుదాటినట్టు గణాంకాలతో సహా వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దీంతో అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించకూడదని నిర్ణయించింది. అందుకే ఏపీని ఆర్థిక విషయాల్లో కట్టడి చేస్తోంది. అయితే ఇది రాజకీయంగా తమకు ప్రతిబంధకంగా మారుతోందని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయంగానే ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం కూడా వారిని వెంటాడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నడవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

    Also Reade:KCR- Etela Rajender: ఈటల మైండ్ గేమ్ తో కేసీఆర్ కు పట్టుకున్న టెన్షన్

    Tags