రాబోయే ఎన్నికల్లో బాబు వ్యూహమేంటి?

వ్యూహాలు రచించడంలో చంద్రబాబు దిట్ట. పరిస్థితులకు అనుగుణంగా తన పంథా మార్చుకునే క్రమంలో ఆయన నిర్ణయాలు ఎక్కడ కూడా అంచనాలు తప్పలేదు. దీంతో అపర చాణక్యుడిగా పేరుగాంచిన బాబు కొద్ది రోజులుగా డైలమాలో పడిపోయారు. అధికారం కోల్పోవడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. పొత్తులతోను జిత్తులు మార్చగల నేతగా చంద్రబాబుకు పేరుంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి పొత్తులతోనే పోటీకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి […]

Written By: Srinivas, Updated On : July 4, 2021 12:09 pm
Follow us on

వ్యూహాలు రచించడంలో చంద్రబాబు దిట్ట. పరిస్థితులకు అనుగుణంగా తన పంథా మార్చుకునే క్రమంలో ఆయన నిర్ణయాలు ఎక్కడ కూడా అంచనాలు తప్పలేదు. దీంతో అపర చాణక్యుడిగా పేరుగాంచిన బాబు కొద్ది రోజులుగా డైలమాలో పడిపోయారు. అధికారం కోల్పోవడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. పొత్తులతోను జిత్తులు మార్చగల నేతగా చంద్రబాబుకు పేరుంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి పొత్తులతోనే పోటీకి దిగుతారనే ప్రచారం సాగుతోంది.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి నడవాలని భావిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు ఆలోచన మాత్రం వేరేలా ఉందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో స్నేహపూర్వక వాతావరణమే మేలని అనిపిస్తోందని ఆలోచిస్తోంది. రాబోయే ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉండడంతో బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు పార్టీ వ్యూహం రచిస్తోంది. వైసీపీ నుంచి రక్షించుకోవడానికి బీజేపీతో స్నేహమే మంచిదని పార్టీ వర్గాలు చెబుతుతున్నాయి.

దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగా నిలిచే పార్టీ లేకుండా పోయింది.దీంతో ప్రతిపక్షం పాత్ర కాంగ్రెస్ పోషించలేకపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రస్తుతం బాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ ఆలోచన పలు పార్టీల్లో ఉన్నా దాని ఆచరణలో పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో బాబు బీజేపీతో జత కట్టాలనే చూస్తున్నారు. ఒకవేళ మూడో కూటమి ప్రణాళిక రూపు దాల్చితే అటు వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. ఇప్పటికే శరత్ పవార్ లాంటి నేతలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ర్టంలో బీజేపీకి కూడాఓటు బ్యాంకు లేదనే సాకుతో పొత్తుపెట్టుకుంటే కలిగే నష్టాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. జనసేన పవన్ కల్యాణ్ తో కలిసి నడిచేందుకు ముందుకు కదులుతున్నారు. ఏది ఏమైనా త్వరలో పార్టీ నిర్ణయం వెల్లడించే అవకాశాలు లేకపోలేదు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉ:డరు. శాశ్వత శత్రువులు కూడా ఉ:డరు. ఇన్నాళ్లు బీజేపీతో సఖ్యత లేకపోయినా ఇప్పుడు బీజేపీతో కలవడానికే ప్రాధాన్యం ఇస్తోంది. మొత్తానికి పొత్తు ల వ్యవహారంలో ఏ పార్టీ ఏ పార్టీతో జత కడుతుందో వేచి చూడాల్సిందే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని పలువరు వేచి చూస్తున్నారు.