
చతుర్మాస దీక్షతో ఇన్నాళ్లు హైదరాబాద్ కే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు భాగ్యనగరాన్ని వీడుతున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు రంగం సిద్ధమైనట్టు జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read: ఆమ్రపాలికి అరుదైన అవకాశం!
అయితే ఇప్పటికే ఏపీలో అమరావతి రైతులకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజధాని మార్పు ఖాయంగా కనిపిస్తున్నా వారి కోసం ఏం చేయడం లేదని విమర్శలు కొని తెచ్చుకున్నారు. ఇటీవల అమరావతి రైతులు పవన్ వైఖరిపై అమరావతిలో నిరసన కూడా తెలిపారు.
దీక్ష ముగియడంతో పవన్ తొట్టతొలిగా ఏపీలోని విశాఖకే వస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రబలడంతో ఇన్నాళ్లు పవన్ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఏపీలో పవన్ అడుగుపెట్టి ఆరు నెలలు అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో పవన్ ఓడిపోయినప్పటి నుంచి విశాఖ రావడానికి పవన్ ఆసక్తి చూపడం లేదని పార్టీ సభ్యులు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తాజా వైజాగ్ పర్యటనలో పెద్ద సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారట.. నాయకులందరినీ కలుస్తానని వాగ్దానం చేసినట్లు తెలిసింది.
Also Read: ఆంధ్రజ్యోతి యూటర్న్…. ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా…?
అయితే అమరావతి రాజధాని రైతులకు మద్దతు తెలిపి.. విశాఖ రాజధానిని వ్యతిరేకించిన పవన్ కు ఇక్కడ ఎలాంటి సెగ తగులుతుందనేది ఆసక్తిగా మారింది. గతంలో వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలన్న వైసిపి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినప్పుడు తీవ్ర నిరసన వ్యక్తమైంది. మరి పవన్ కళ్యాణ్ తాజా పర్యటనలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.