
MAA Elections: ‘మా’ ఎన్నికల వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. అసలు ప్రకాష్ రాజ్ కి ఏమైంది ? ఆయనకు షూటింగ్స్ లేవా ? లేక ట్రాక్ తప్పాడా ? ఎన్నికలు ముగిసినా విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఆ వేడిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అసలు ఎందుకు ప్రకాష్ రాజ్ ఇంకా ‘మా’ ఎన్నికలను పట్టుకుని వేలాడుతున్నాడు ? ఎప్పటికప్పుడు జరిగిన పరిణామాల పై కౌంటర్లు ఇస్తూ అగ్గిని రాజేస్తూనే ఉన్నాడు.
నిజంగా ప్రకాష్ రాజ్ సేవే చేయాలి అనుకుంటే.. సొంతంగా ఒక ట్రస్ట్ పెట్టుకుని చెయ్యొచ్చు. ఎలాగూ సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ, ప్రకాష్ రాజ్ చేస్తుంది ఏమిటి ? ఓటమికి కారణాలు వెతుక్కుంటూ అడ్డమైన సాకులు చెబుతూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. పైగా తన వల్ల తన ప్యానెల్ తరఫున గెలిచిన 11 మంది చేత రాజీనామా చేయించాడు.
తాజాగా ‘మా’ ఎన్నికల(MAA Elections) సమయంలో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కి ఒక లెటర్ రాశాడు. అయితే ప్రకాశ్ రాజ్ ఈ లెటర్ లో పొందుపరిచిన అంశాలు గెలిచిన ప్యానెల్ కి చాలా ఆవేశాన్ని రగిలించేలా ఉంది. మా ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేదు అని ప్రకాష్ రాజ్ ఎలా చెప్పగలడు ? ఒకవేళ ప్రకాష్ రాజ్ ఆరోపణల్లో నిజం ఉంది అనుకుంటే… ఆ రోజు ప్రకాష్ రాజ్ ఏం చేశాడు ?
మంచు విష్ణుతో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. కానీ ఇప్పుడు ఏమి అంటున్నాడు ? ఎన్నికల రోజు ఎన్నో భయంకర ఘటనలు జరిగాయని, మోహన్ బాబు, నరేశ్ ప్రవర్తన దారుణంగా ఉందని ప్రకాష్ రాజ్ లెటర్ లో రాసుకొచ్చాడు. కచ్చితంగా ఇది ప్రకాష్ రాజ్ లేకి తనానికి చేతగానితనానికి సింబాలిజమ్ అనుకోవాలి. లేకపోతే, కొందరు ‘మా’ సభ్యులపై వారు దాడి చేశారని ఎందుకు చెబుతాడు ?
మరి దాడి చేసినప్పుడు ప్రకాష్ రాజ్ ఏమి చేస్తున్నట్లు ? పోలింగ్ సమయంలో సీసీ కెమెరాల గురించి ఇప్పుడు అడుగుతున్నారు. తన ఓటమికి కారణం వేరే ఎవరో అని చాటి చెప్పడానికా ? పైగా సీసీ ఫుటేజ్ డిలిట్ అయ్యే అవకాశాలున్నాయని అంటాడా ? అంటే, మోహన్ బాబు బృందం ఆ సీసీ ఫుటేజ్ డిలేట్ చేస్తోంది అనేగా ? ప్రకాశ్ రాజ్ ఇప్పటికైనా పద్దతి మారిస్తే బెటర్. ఇక ఎన్నికలను పూర్తిగా మర్చిపోయే, పని పై ఆయన తన ఏకాగ్రత పెట్టాలని ఆశిద్దాం.