https://oktelugu.com/

Disaster Funds In AP: ఏపీలో విపత్తు నిధులు ఏమయ్యాయి.. సుప్రీం కోర్టు ఆరా

Disaster Funds In AP: ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి మరోసారి నవ్వుల పాలైంది. విపత్తు సహాయ నిధులను పీడీ ఖాతాలకు మళ్లించడంపై సుప్రీం కోర్టు ఆరా తీసింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ అసలు ప్రభుత్వం నిజమే చెబుతోందా? లేక ఇందులో ఏమైనా మర్మం ఉందో తేల్చాలని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రూ.1100 కోట్ల […]

Written By:
  • Dharma
  • , Updated On : May 14, 2022 6:18 pm
    Follow us on

    Disaster Funds In AP: ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి మరోసారి నవ్వుల పాలైంది. విపత్తు సహాయ నిధులను పీడీ ఖాతాలకు మళ్లించడంపై సుప్రీం కోర్టు ఆరా తీసింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ అసలు ప్రభుత్వం నిజమే చెబుతోందా? లేక ఇందులో ఏమైనా మర్మం ఉందో తేల్చాలని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రూ.1100 కోట్ల విపత్తు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందంటూ విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను పరిశీలించి… అందులో ఉన్న వివరాలు నిజమో, కాదో తేల్చాలని కాగ్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ నిధుల నుంచి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే… ఆ నిధులను వ్యవసాయ శాఖ పీడీ ఖాతాలకు మళ్లించిందని పిటిషనర్‌ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల న్యాయస్థానం నుంచి ఏపీ ప్రభుత్వానికి వరుస మొట్టికాయలు తగులుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది.

    Disaster Funds In AP

    B V Nagarathna

    Also Read: AP Chief Election Officer: ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ మార్పు: దేనికి సంకేతం… అలా ముదుకు వెళ్తారా? సాధారణమేనా?

    ఒప్పుకుంటూనే మెలిక..

    మరోవైపు వ్యవసాయ శాఖ పీడీ ఖాతాలకు రూ.1100 కోట్లు మళ్లించడం నిజమేనని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పుకొచ్చింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఆ నిధులు ఇచ్చినందున వాటిని వ్యవసాయ శాఖ ఖాతాలకు బదిలీ చేశామని వక్రభాష్యం చెబుతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ సీఎస్‌ సమీర్‌ శర్మ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2018 ఖరీఫ్‌ సీజన్‌లో కరువు సహాయం కోసం రూ.1401.54 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. కానీ… కేంద్రం రూ.900.4 కోట్లే ఇచ్చింది. అందులో రూ. 759.98 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం కేటాయించింది. దీనికి రాష్ట్రం మరిన్ని నిధులు కలిపి రూ.1838.25 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రైతులకు చెల్లించాలని 2019 మార్చిలో నిర్ణయించింది. అయితే, ఎన్నికల కోడ్‌ తో సాధ్యపడలేదు. ఆ తర్వాత కరోనాను ఎదుర్కోడానికి ఆ నిధులను వినియోగించల్సి వచ్చింది. 759.98 కోట్లు దుర్వినియోగం కాకుండా.. ఆ మొత్తంతోపాటు రాష్ట్రం రూ.340.02 కోట్లను కలిపి వ్యవసాయ శాఖ కమిషనర్‌ పీడీ ఖాతాకు రూ.1100 కోట్లు బదిలీ చేసిం ది. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1838.25 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ… కరోనా కారణంగా మిగిలిన రూ.738.25 కోట్లను సర్దుబాటు చేయలేకపోయాం. దీనిపై కాగ్‌కు సమాధానం ఇచ్చాం. పిటిషనర్‌ ఆరోపించినట్లుగా నిధుల మళ్లింపు జరగలేదు అని పిటీషన్ లోపేర్కొన్నారు. కాగా, నిధులు మళ్లించినట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు మార్చి 12న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి రాసిన లేఖపై పిటిషనర్‌ ఆధారపడ్డారని, ఈ లేఖతో ప్రస్తుత కేసుకు సంబంధం లేదని తెలిపారు. ఆ లేఖ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదని, కానీ కరోనా పరిహారం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాఖలవ్వగా గతేడాది జూన్‌ 30న తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసిందని సమీర్‌ శర్మ వెల్లడించారు. కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడానికి రూ. 199.86 కోట్లు విడుదల చేశామన్నారు.

    Also Read: Balakrishna: బాలయ్య అప్పట్లో ఎంత కట్నం డిమాండ్ చేశారో తెలుసా ?

    Tags