https://oktelugu.com/

AP Govt: బడ్జెట్ లేదు.. గిడ్జెట్ లేదు.. 94 వేల కోట్లు ఏమైపోయాయబ్బా?

AP Govt: ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చు పెట్టాలన్నా దాన్ని అసెంబ్లీలో బడ్జెట్ గా ప్రవేశపెట్టి.. ఆమోదించుకొని.. కేటాయింపులు చేసి అందులోంచి ఖర్చు చేయాలి.కానీ కరోనా కల్లోలం పేరుతో ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా కొద్దికాలం నడిపింది. అయితే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టినా కూడా దాన్ని పెడచెవిన పెట్టిందా? సొంతానికి ఇష్టంగా ఖర్చు చేస్తోందా? అంటే ‘అకౌంటెంట్ జనరల్’ ఔననే అంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఏపీ ప్రభుత్వం 94వేల కోట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2022 / 01:12 PM IST
    Follow us on

    AP Govt: ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చు పెట్టాలన్నా దాన్ని అసెంబ్లీలో బడ్జెట్ గా ప్రవేశపెట్టి.. ఆమోదించుకొని.. కేటాయింపులు చేసి అందులోంచి ఖర్చు చేయాలి.కానీ కరోనా కల్లోలం పేరుతో ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా కొద్దికాలం నడిపింది. అయితే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టినా కూడా దాన్ని పెడచెవిన పెట్టిందా? సొంతానికి ఇష్టంగా ఖర్చు చేస్తోందా? అంటే ‘అకౌంటెంట్ జనరల్’ ఔననే అంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఏపీ ప్రభుత్వం 94వేల కోట్లు ఖర్చు చేయడంపై తాజాగా ‘అకౌంటెంట్ జనరల్’ ఏపీ సర్కార్ కు లేఖ రాయడం కలకలం రేపింది.

    AP Govt

    కేటాయింపులు లేకుండా అనుమతులు లేకుండా బడ్జెట్ నిబంధనలు ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టడాన్ని తాజాగా ‘అకౌంటెంట్ జనరల్’ లేఖ రాయడం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వం తీరుపై వారంతా అభ్యంతరాలు తెలిపారు.

    నిబంధనల ప్రకారం.. ఒక ప్రభుత్వం బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకొని ఖర్చు చేయాలి. అలా చేయకుండా ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి వీల్లేదు. నిబంధనలు అలా కఠినంగా ఉంటాయి. కానీ ఏపీ ప్రభుత్వం 94వేల కోట్లు ఖర్చు చేయడంపై ఏజీ కార్యాలయం విస్తుపోయింది. సంక్షేమానికి భారీగానే నిధులను బడ్జెట్ లో ఆమోదించింది.

    Also Read: వైఎస్ వివేకా కేసు: చిక్కుల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి?

    వీటికి కేటాయింపులు ఏవనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. 38 శాఖల ద్వారా 17వేల కోట్ల వరకూ వ్యయం చేసేందుకు ఆమోదం పొందగా.. ఏకంగా 30వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తేలింది. అనుమతులు లేకున్నా 13వేల కోట్లు ఖర్చు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

    ఇప్పుడు ఈ 94వేల కోట్లు ఖర్చు చేసిందా? లేక లెక్కల తకరారుతో గోల్ మాల్ అయ్యిందా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అకౌంటెంట్ జనరల్ పంపిన లేఖపై ఏపీ ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది? ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్నది వేచిచూడాల్సి ఉంది. దీనిపై కాగ్, ఏజీ లాంటి వ్యవస్థలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.

    Also Read: ఏపీలో జవహర్ రెడ్డిదే అంతా నడుస్తోందా?

    Recommended Video: