Homeఆంధ్రప్రదేశ్‌మండలి రద్దు తీర్మానం మరుగున పడినట్లేనా?

మండలి రద్దు తీర్మానం మరుగున పడినట్లేనా?

AP Legislative councilశాసనమండలి రద్దు గురించి సీఎం జగన్ మెత్తబడ్డారు. గతంలో మండలి రద్దు చేయాని తీర్మానం చేసి కేంద్రానికి పంపిన జగన్ ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు.దీనికి కారణం మండలిలో వైసీపీ బలం పెరగడమే. దీంతో సీఎం వైసీపీ నుంచి నులుగురిని ఎమ్మెల్సీగా ఎన్నుకోబోతున్నారు. గవర్నర్ కోటాలో నలుగురిని నియమించేందుకు రాజ్ భవన్ కు పంపారు. ఏ క్షణమైనా వాటికి ఆమోదముద్ర పడే అవకాశముంది. మోషెన్ రాజు, అప్పిరెడ్డి, ఆర్వీ రమేష్, తోట త్రిమూర్తులులకు ఎమ్మెల్సీ పోస్టులు ఖరారు చేశారు.
శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సీఎం జగన్ మండలిలో ఖాళీ అయిన స్థానాలను చాలా సీరియస్ గా భర్తీ చేస్తున్నారు. సీఎం జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో కూడా శాసనమండలి రద్దు అంశం ప్రస్తావనకు రాలేదు. జులై ఆఖరుకు మండలిలో వైసీపీకి మెజార్టీ వస్తుంది. దీంతో ఆ పార్టీ నేతలెవరు ఇప్పుడు శాసనమండలి రద్దు గురించి నోరెత్తడం లేదు.
కేవలం మూడు రాజధానుల బిల్లు, అంతకుముందు ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం బిల్లులను శాసనమండలి వెనక్కి పంపడంపై మాత్రమే. శాసనమండలి రద్దు చేయాలని ఆగమేఘాల మీద కేబినెట్ లో తీర్మానం చేయించారు. వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అప్పటి నుంచి కేంద్రం వద్ద ఈ అంశం పెండింగులో ఉంది. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ బలం పెరుగుతోంది. అందుకే సైలెంట్ అయిపోయారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సంరద్భంగా మూడు రాజధానుల అంశం ప్రస్తావించారు కాని శాసనమండలి రద్దు గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా గురు, శుక్ర వారాల్లో వైసీపీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కూడా ఈ అంశంపై ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఈనేపథ్యంలోనే వైసీపీ గవర్నర్ కోటాతోపాటు స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో శాసనమండలిలో తమ బలం పెరుగుతుందని అంచనా వేసింది.
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version