బెంగాల్ లో ఏపీ పరిస్థితి ఉంటే ఏం జరిగేది..?

పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఓ దశలో బీజేపీ నాయకులపైనే తీవ్రంగా దాడులు జరిగాయని ఆ పార్టీ నాయకులు వాదించారు. దీంతో గరవ్నర్ హూటాహుటిన హోంశాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలన్నంత పని చేశారు. ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేకు కేంద్ర బలగాల భద్రతను కల్పించారు. అయితే ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. సాక్షాత్తూ ఓ ఎంపీని కస్టడీలో ఉండగా […]

Written By: NARESH, Updated On : May 17, 2021 11:41 am
Follow us on

పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఓ దశలో బీజేపీ నాయకులపైనే తీవ్రంగా దాడులు జరిగాయని ఆ పార్టీ నాయకులు వాదించారు. దీంతో గరవ్నర్ హూటాహుటిన హోంశాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలన్నంత పని చేశారు. ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేకు కేంద్ర బలగాల భద్రతను కల్పించారు.

అయితే ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. సాక్షాత్తూ ఓ ఎంపీని కస్టడీలో ఉండగా చితకబాదడం.. ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం వంటివి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ఇక్కడి గవర్నర్ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న ఆరా కూడా తీయడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజును సీఐడీ టార్గెట్ చేసిందని, రాజకీయ వేధింపుల లక్ష్యంగానే ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు. అయితే ఇంతవరకు స్పందన లేదు.

ప్రభుత్వం నియమించిన సూపరింటెండెంట్ ప్రభుత్వం కోరినట్లుగా నివేదిక ఇవ్వాలి. కానీ కాళ్లు వాచాయి.. రంగు మారాయి.. అవి కొట్టిన గాయాలు కావని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక హస్యాస్పదంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఏపీలో రాజ్యాంగ హక్కులు తీవ్రంగా ఉల్లంఘనలు జరిగాయని, తక్షణం విచారణ జరిపి రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

అయితే గరవ్నర్ మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో రకరకాల వాదనలు వస్తున్నాయి. అయితే బీజేపీ ప్రత్యర్థిగా ఉండే రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇలా ఉంటే చర్యలు వేరే రకంగా ఉండేవని ఇక్కడ మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు.