Homeజాతీయ వార్తలుKCR- Etela Rajender: కేసీఆర్‌ ఈటల మధ్య ఏం జరిగింది.. ఘర్‌ వాపసీ వార్తలెలా వచ్చాయి!?

KCR- Etela Rajender: కేసీఆర్‌ ఈటల మధ్య ఏం జరిగింది.. ఘర్‌ వాపసీ వార్తలెలా వచ్చాయి!?

KCR- Etela Rajender: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ కేసీఆర్‌ ఆపరేషన్‌ ఘర్‌ వాపసీ ప్రారంభించారు. మునుగోడు ఓడితే.. బీఆర్‌ఎస్‌కు ఆదిలోనే ఆటకం తప్పదన్న భావనలో కేసీఆర్‌ పార్టీ వీడిన తెలంగాణ ఉద్యమకారులను తిరిగి సొంత గూటికి రప్పిచే ప్రక్రియ చేపట్టారు. తెలంగాణ ఉద్యమ పార్టీ.. తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి వెళ్లిందన్న అపవాదు తొలగించుకునే ప్రయత్నం చేపట్టారు.

KCR- Etela Rajender
KCR- Etela Rajender

ఈ క్రమంలో అసంతృప్తితో పార్టీని వీడి పోయిన వారికి బంపర్‌ ఆఫర్లు ఇచ్చి వెనక్కి పిలుస్తున్నారు. స్వామిగౌడ్, శ్రవణ్‌ వంటి వాళ్లు చేరారు. ఇలా ఆఫర్లు అందుకున్న వారిలో ఈటల కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన తిరిగి వస్తే పార్టీలో నంబర్‌ 2 పొజిషన్‌ ఇస్తామన్న సంకేతాలను పంపినట్లుగా చెబుతున్నారు.

బీజేపీలో ఇమడలేక పోతున్నాడని..
ఈటల రాజేందర్‌ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. తన అసంతృప్తిని హైకమాండ్‌కు తెలిసేలా చేస్తున్నారు. కానీ ఆ ప్రభావం పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. చేరికల కమిటీ ఇన్‌చార్జిగా కూడా ఈటల ఉన్నారు. కానీ చేరికలు, సంప్రదింపులు అన్నీ ఈటలకు సంబంధం లేకుండానే సాగుతున్నాయి. అదే సమయంలో పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కకుండా.. ఒకరే పెత్తనం చేస్తున్నారని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయంలో ఈటల ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గులాబీ బాస్‌ కేసీఆర్‌.. ఆపరేషన్‌ ఘర్‌ వాపసీలో ఈటలకు ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దేవరయాంజల్‌ భూములపై ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చింది. అవన్నీ ప్రభుత్వ భూములేనని వెనక్కి తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఇది కూడా ఈటలకు సంకేతమని అంటున్నారు. వెనక్కి రాకపోతే.. ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటామని సంకేతం పంపినట్లేనని తెలుస్తోంది. ఆ భూముల్లో ఈటలకు చెందిన గోడౌన్లు ఉన్నాయి.

కేసీఆర్‌ ఆఫర్‌ తిరస్కరించిన ఈటల..
టీఆర్‌ఎస్‌ నుంచి అవమానకర రీతిలో ఈటలను కేసీఆర్‌ బయటకు వెళ్లేలా చేశారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేశారు. భూ కబ్జా ఆరోపణలు చేశారు. విచారణ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల మళ్లీ కేసీఆర్‌ దగ్గరకు వెళ్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతన్నాయి. ఈటలకు ఆత్మగౌరవం ఎక్కువ. వివాదాలకు దూరంగా ఉంటారు. సౌమ్యుడిగా పేరు ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తీవ్రంగా అవమానించి పంపించారు. ఇప్పుడు కేసీఆర్‌ స్వయంగా వచ్చి పిలిచినా ఈటల తిరిగి టీఆర్‌ఎస్‌కు వెళ్లే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆపరేషన్‌ ఘర్‌ వాపసీలో భాగంగానే ఈటలను బ్లేమ్‌ చేయడానికి టీఆర్‌ఎస్‌ వేసిన మరో ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు.

KCR- Etela Rajender
KCR- Etela Rajender

శ్రవణ్, స్వామిగడ్‌లా కాదు..
ఆపరేషన్‌ ఘర్‌ వాపసీలో కేసీఆర్‌ పిలుపు మరకు దాసోజు శ్రవణ, స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే వాళ్లు.. స్వయంగా పీర్టీని వీడారు. కేసీఆర్‌ వాళ్లను పంపించలేదు. అవమానించలేదు. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వని కారణంగా శ్రవణ్, ఎమ్మెల్సీ పదవి పొడిగించని కారణంగా స్వామిగౌడ్‌ పార్టీని వీడారు. బయటకు వచ్చాక శ్రవణ్‌ టీఆర్‌ఎస్‌పై చేయని ఆరోపణ లేదు. కేసీఆర్‌ను అయితే తూర్పారబట్టారు. కాళేశ్వరం అవినీతిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన ఇచ్చారు. ధరణిలోని లోపాలను ఎత్తిచూపారు. కానీ తాను ఎమ్మెల్యే కావాలన్న కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ పిలుపుతో మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరారు. స్వామిగౌడ్‌ కూడా మళ్లీ ఎమ్మెల్సీ హామీతోనే తిరిగి సొంత గూటికి వచ్చారు. కానీ, ఈటల పార్టీనుంచి బయటకు వెళ్లిన తీరు, సందర్భం వేరు. నంబర్‌ 2గా ఎదిగిన ఎవరినీ కేసీఆర్‌ మొదటి నుంచి ఓర్వరు. ఈటల కేసీఆర్‌ తర్వాత అన్నంతగా ఎదిగారు. దీంతో మంత్రి పదవిని కూడా లాక్కున్న కేసీఆర్‌.. భూకబ్జాదారుడిగా ముద్ర వేశారు. మరోవైపు బీజేపీ అధిష్టానానికి ఈటలకు మంచి గౌరవం ఉంది. స్థానికంగా చిన్నచిన్న సమస్యలు ఉన్నా.. నడ్డా, అమిత్‌షాతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అన్నీ కలిసి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల సీఎం కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈటలపై కేసీఆర్‌ ప్రయోగించిన ఆపరేషన్‌ ఘర్‌ వాపసీ పనిచేయలేదని తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular