జగన్ బెయిల్ రద్దుపై టీడీపీ ఏమనుకుంటోంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై పలు రకాల ప్రచారాలు సాగుతున్నాయి. సీబీఐ కోర్టులో వాయిదా వచ్చిన ప్రతిసారి జగన్ బెయిల్ రద్దు అయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు సైతం సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆయన పూర్తికాలం పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు. తరచి చూస్తే అది నిజమేనని ఎవరికైనా అనిపించక మానదు. సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. […]

Written By: Srinivas, Updated On : July 17, 2021 3:11 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై పలు రకాల ప్రచారాలు సాగుతున్నాయి. సీబీఐ కోర్టులో వాయిదా వచ్చిన ప్రతిసారి జగన్ బెయిల్ రద్దు అయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు సైతం సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆయన పూర్తికాలం పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు. తరచి చూస్తే అది నిజమేనని ఎవరికైనా అనిపించక మానదు.

సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో రెండున్నరేళ్ల పాలన మిగిలే ఉంది. కానీ ఆయన పథకాలు ప్రజలకు చేరినా ఇతరుల్లో అసంతృప్తి రగులుతూనే ఉంది. దీంతో ఓటు బ్యాంకు కూడా తమ వద్ద పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ములో కొంత భాగమే ఇస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో పెరిగిన ధలు, పెట్రోల్ రేట్లు జగన్ కు ఆశనిపాతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉధ్యోగుల పరిస్థితి అయితే చెప్పతరం కాదు. వారికి జీతాలు సైతం సరిగ్గా రావడం లేదు. దీంతో వారిలో కూడా అసహనం పెరిగిపోతోంది. సర్కారు పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది.

ప్రభుత్వ ఖజానా రోజురోజుకు దిగజారడంతో సంక్షేమ పథకాల అమలు అపేస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయన బెయిల్ రద్దు అయితే మరింత సానుభూతి పొందుతారని చెబుతున్నారు. ఒక వేళ బెయిల్ రద్దు అయి జైలుకు వెళ్లినా టీడీపీకి వచ్చే లాభం ఏం ఉండదని అంటున్నారు అందుకే బెయిల్ రద్దు గురించి వారు కూడా కాకూడదనే కోరుకుంటున్నారు దీంతో జగన్ బెయిల్ రద్దుపై ప్రతిపక్షం కూడా సానుకూలంగా ఉండడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. సంక్షేమ పథకాల అమలుతో ఖజానా మరింత క్షీణిస్తోంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ప్రతిపక్షం మాత్రం ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమనే చెప్పుకుంటోంది. దీంతో సీఎం జగన్ ఏ మేరకు గట్టెక్కుతారో అనే విషయం చర్చనీయాంశంగా మారింది.