Pawan Kalyan On Modi: ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవలే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. చాలా ఆప్యాయతగా మెలిగారు.. ఇప్పుడు తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ పవన్ తో చాలా సన్నిహితంగా గడిపారు. తన వెంట పవన్ ఉన్నాడని ధైర్యంగా చెప్పుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓటమి చవిచూసినా.. ఓ నాయకుడికి ఇచ్చిన విలువ ఇది అంటూ జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంటుంది. అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన బిజెపి బీసీ జన గర్జన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై ప్రధాని మోదీ పక్కనే పవన్ కూర్చున్నారు. ఈ సందర్భంలో మోదీ పవన్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన ముచ్చట్లపై రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. అటు సోషల్ మీడియాలో సైతం ఆ ఇద్దరి నేతల మధ్య జరిగిన సంభాషణ ఏంటి అన్నదానిపైనే చర్చ జరుగుతోంది. మోదీ, పవన్ మాటలను లిప్ రీడింగ్ చేసి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు. ఈ ఆసక్తికర అంశాలుగా ఉన్నాయి.
ఇటీవల చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చంద్రబాబు గురించి ఆరా తీసి ఉంటారని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు ఇష్యూ తో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ పవన్ను అడిగి తెలుసుకుని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ తన భుజాన్ని చూపిస్తూ మోదీ తో మాట్లాడారని.. అది కచ్చితంగా జగన్ కోడి కత్తి కేసు గురించే అయి ఉంటుందని.. మరికొందరు చమత్కరిస్తున్నారు. కానీ ఇలా ఎవరికి తోచింది వారు అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం ఆసక్తిగా మారింది.
మరోవైపు ఇదే వేదికపై ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన వెంట పవన్ ఉన్నాడని చెప్పడంతో.. ప్రధాని దగ్గరకు వెళ్లి మరి పవన్ కరచలనం చేశారు. విపరీతమైన ప్రేమ కురిపించారు. జన సైనికులకు ఇది ఓ టానిక్ లా కనిపిస్తోంది. ఇవే వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇది మా నాయకుడు స్టామినా అంటూ ట్విట్ల మోత మోగిస్తున్నారు. వైసిపి పేటీఎం బ్యాచ్కు ఇది ఎప్పటికీ అర్థం కాదని ఎద్దేవా చేస్తూ.. సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.