https://oktelugu.com/

ఈటలను ఓడించాలంటే.. కేసీఆర్ ప్లాన్లు ఏంటి?

హుజురాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఈటల రాజేందర్ ను ఓడించాలని అన్ని దారులు వెతుకుతున్నాయి. టీఆర్ఎస్ తో విభేదింంచి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను దెబ్బ తీయాలని చూస్తున్నారు. దీంతో ఎన్నికల తంతు వేడిని తలపిస్తోంది. అప్పుడే టీఆర్ఎస్ నేతలు ఇక్కడే తిష్టవేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు కదులుతున్నారు. హుజురాబాద్ లో దీటైన […]

Written By: , Updated On : July 5, 2021 / 10:24 AM IST
Follow us on

Huzurabad By Elections

హుజురాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఈటల రాజేందర్ ను ఓడించాలని అన్ని దారులు వెతుకుతున్నాయి. టీఆర్ఎస్ తో విభేదింంచి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను దెబ్బ తీయాలని చూస్తున్నారు. దీంతో ఎన్నికల తంతు వేడిని తలపిస్తోంది. అప్పుడే టీఆర్ఎస్ నేతలు ఇక్కడే తిష్టవేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు కదులుతున్నారు.

హుజురాబాద్ లో దీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్వేషణ చేస్తున్నారు. ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓఢించి తన పగ నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు చేయించి అభ్యర్థుల బలాబలాలు బేరీజు వేస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించారు. ఈటలను ఎదుర్కొనే వారి కోసమే ఇన్నాళ్లు వెతుకుతున్నారు. దీంతో ఆయనకు సరైన వ్యక్తి అయితేనే గెలుస్తామని భావించి అందు కోసం చూస్తున్నారు.

బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో దీటైన వారి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటలను ఎలాగైనా దెబ్బ కొట్టాలని సమర్థత కలిగిన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మికాంతరావు సతీమణి, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

హుజురాబాద్ పై పట్టు సాధించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించారు. చేపట్టిన పనులు 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈటలను ఓడించడమే ధ్యేయంగా కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో హుజురాబాద్ లో ఎవరి ప్రభావం ఏమేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.